కపటా లూరకే మాతో కప్పేపు నే మెరఁగమా
(॥పల్లవి॥)
కపటా లూరకే మాతో కప్పేపు నే మెరఁగమా
యిపు డాకె నీవొద్ద నిట్టే వుండదా
(॥కప॥)
ముంగిట నాతోడ నీవు మొరగులాడేవు గాక
అంగన నీవును గూడి ఆడ నుండరా
సంగతి నాతోనే ఆచారములు నెరుపేవు
యెంగిలి నీమోవి అంట కిట్టే వుండేనా
(॥కప॥)
చలపట్టి నేఁడే నాకు చన విచ్చితివి గాక
నలిరేఁగి యిందాఁకా నవ్వు చుండరా
అలిగె నంటా నన్ను నానలు వెట్టేవు గాక
తలుపు మాటు చెలి తానే కాదా
(॥కప॥)
కాయము నాపై వేసి కాఁగిటఁ గూడితి గాక
పాయక యీపెయు నీవుఁ బవ్వళించరా
యీయెడ శ్రీవేంకటేశ యిటు నాకె దక్కితివి
చాయల నాపెయు నీకు సతమే కాదా
(||pallavi||)
kabaḍā lūrage mādo kappebu ne mĕram̐gamā
yibu ḍāgĕ nīvŏdda niṭṭe vuṁḍadā
(||kaba||)
muṁgiḍa nādoḍa nīvu mŏragulāḍevu gāga
aṁgana nīvunu gūḍi āḍa nuṁḍarā
saṁgadi nādone āsāramulu nĕrubevu
yĕṁgili nīmovi aṁṭa kiṭṭe vuṁḍenā
(||kaba||)
salabaṭṭi nem̐ḍe nāgu sana vichchidivi gāga
nalirem̐gi yiṁdām̐kā navvu suṁḍarā
aligĕ naṁṭā nannu nānalu vĕṭṭevu gāga
talubu māḍu sĕli tāne kādā
(||kaba||)
kāyamu nābai vesi kām̐giḍam̐ gūḍidi gāga
pāyaga yībĕyu nīvum̐ bavvaḽiṁcharā
yīyĕḍa śhrīveṁkaḍeśha yiḍu nāgĕ dakkidivi
sāyala nābĕyu nīgu sadame kādā