Kaayamum braayamum bo kaliginadi

కాయముఁ బ్రాయముఁ బో కలిగినది
Language

(॥పల్లవి॥)
కాయముఁ బ్రాయముఁ బో కలిగినది
యేయెడ నాతఁడు నీవు నెంచినను

(॥కాయ॥)
చెక్కిటి చేతితోడ సిగ్గువడే విదియేమే
చొక్కపు విభుఁడు నిన్నుఁ జూచెనంటాను
వొక్కనిమిషములోనే ను(వు?) డివోవు నివియెల్ల
గక్కన నాతఁడు నిన్నుఁ గదిసినను

(॥కాయ॥)
మంతనాన మాఁటకు మాఁటాడ విదియేమే
పంతపువిభుఁడు నీతోఁ బలుకఁగాను
యింతలోనే యనుమాన మిఁకనేల తగులాయ
చెంతల నాతఁడు నిన్నుఁ జెనకఁగను

(॥కాయ॥)
చెలరేఁగే విదియేమే శ్రీవేంకటేశుడు
యెలమిఁ గూడి చన విచ్చెనంటాను
తొలుత నే నిందుకే పో తొడఁగి చెప్పినదెల్లా
మెలుపున నీడేరె మీకిఁకను

(||pallavi||)
kāyamum̐ brāyamum̐ bo kaliginadi
yeyĕḍa nādam̐ḍu nīvu nĕṁchinanu

(||kāya||)
sĕkkiḍi sedidoḍa sigguvaḍe vidiyeme
sŏkkabu vibhum̐ḍu ninnum̐ jūsĕnaṁṭānu
vŏkkanimiṣhamulone nu(vu?) ḍivovu niviyĕlla
gakkana nādam̐ḍu ninnum̐ gadisinanu

(||kāya||)
maṁtanāna mām̐ṭagu mām̐ṭāḍa vidiyeme
paṁtabuvibhum̐ḍu nīdom̐ balugam̐gānu
yiṁtalone yanumāna mim̐kanela tagulāya
sĕṁtala nādam̐ḍu ninnum̐ jĕnagam̐ganu

(||kāya||)
sĕlarem̐ge vidiyeme śhrīveṁkaḍeśhuḍu
yĕlamim̐ gūḍi sana vichchĕnaṁṭānu
tŏluda ne niṁduge po tŏḍam̐gi sĕppinadĕllā
mĕlubuna nīḍerĕ mīgim̐kanu