కాయము నాదే అట కర్తను నే నట నా
(॥పల్లవి॥)
కాయము నాదే అట కర్తను నే నట నా-
చాయకవి రావు నన్నే జరసీఁ గాని
(॥కాయ॥)
తలఁచినట్టుండదు తలఁపు నాదైనాను
కులికి నన్నే పనిగొనీఁగాని
నిలిపిన యట్టుండవు నేఁడు నా మాటలే నాకు
పొలసి నన్నే కడు బొంకించీఁగాని
(॥కాయ॥)
కలిమి లేమెరఁగదు కాయము నాదైనాను
కొలఁదికి నేమైనాఁ గోరీఁగాని
యిల నాయంకెకు రావు యింద్రియములు నావైనా
కలసి నామర్మములే కాఁడిపారీఁగాని
(॥కాయ॥)
పంపు నాకుఁ జేయదు భవమిది నాదైనా
తెంపున కర్మవీధులఁ దిప్పీఁ గాని
యింపుల శ్రీవేంకటేశ యిది యరాజికమాయ
పంపున నీకిదె మొఱ ప్రతిపాలించఁగదే
(||pallavi||)
kāyamu nāde aḍa kardanu ne naḍa nā-
sāyagavi rāvu nanne jarasīm̐ gāni
(||kāya||)
talam̐sinaṭṭuṁḍadu talam̐pu nādainānu
kuligi nanne panigŏnīm̐gāni
nilibina yaṭṭuṁḍavu nem̐ḍu nā māḍale nāgu
pŏlasi nanne kaḍu bŏṁkiṁchīm̐gāni
(||kāya||)
kalimi lemĕram̐gadu kāyamu nādainānu
kŏlam̐digi nemainām̐ gorīm̐gāni
yila nāyaṁkĕgu rāvu yiṁdriyamulu nāvainā
kalasi nāmarmamule kām̐ḍibārīm̐gāni
(||kāya||)
paṁpu nāgum̐ jeyadu bhavamidi nādainā
tĕṁpuna karmavīdhulam̐ dippīm̐ gāni
yiṁpula śhrīveṁkaḍeśha yidi yarājigamāya
paṁpuna nīgidĕ mŏṟa pradibāliṁcham̐gade