కాయ పండు సేయఁబోతే కడు పులుసే కాక
(॥పల్లవి॥)
కాయ పండు సేయఁబోతే కడు పులుసే కాక
యే యెడ తీపుగాదు యిటువంటిదే
(॥కాయ॥)
కోప మెల్లా నొకవంకకూడవేసి మఱికదా
పైపై హరిఁ దలఁప పాత్రుఁ డయ్యేది
కైపు గాక రుచులపై కాంక్షి మాని మఱి కదా
వోపి లోకముల సడ్డ వొల్లకుండేది
(॥కాయ॥)
పంచేంద్రియముల నెల్ల పారఁదోలి మఱి కదా
వుంచపువిరక్తి కెల్ల వొడి గట్టేది
కొంచెపు కోరికెల్ల కోరకుండి మఱికదా
వంచి హరిదాసులలో వహి కెక్కేదీ
(॥కాయ॥)
వేవేలు పనులెల్ల విడిచిన మఱికదా
శ్రీవేంకటేశ్వరునిఁ జింతించేది
భావించి యితని దాసపరికరమై కదా
త్రోవ చూచి మోక్షము తుది కెక్కేది
(||pallavi||)
kāya paṁḍu seyam̐bode kaḍu puluse kāga
ye yĕḍa tībugādu yiḍuvaṁṭide
(||kāya||)
koba mĕllā nŏgavaṁkagūḍavesi maṟigadā
paibai harim̐ dalam̐pa pātrum̐ ḍayyedi
kaibu gāga rusulabai kāṁkṣhi māni maṟi kadā
vobi logamula saḍḍa vŏllaguṁḍedi
(||kāya||)
paṁcheṁdriyamula nĕlla pāram̐doli maṟi kadā
vuṁchabuvirakti kĕlla vŏḍi gaṭṭedi
kŏṁchĕbu korigĕlla koraguṁḍi maṟigadā
vaṁchi haridāsulalo vahi kĕkkedī
(||kāya||)
vevelu panulĕlla viḍisina maṟigadā
śhrīveṁkaḍeśhvarunim̐ jiṁtiṁchedi
bhāviṁchi yidani dāsabarigaramai kadā
trova sūsi mokṣhamu tudi kĕkkedi