Kaavalasina panulu kaagamaaneenaa neevu

కావలసిన పనులు కాకమానీనా నీవు
Language

(॥పల్లవి॥)
కావలసిన పనులు కాకమానీనా నీవు
కావరాన ముకుఁదాట కాలుగుచ్చేవేలరా

(॥కావ॥)
కానీ కానీ నీవేమన్నాఁ గాదనరా । యిట్టె
ఆనించక పిలువవద్దంటి మింతేరా
మేనవావి నీకు నాకు మెరసెఁ దొల్లె । నేఁడె
నానఁబెట్టి సెలవుల నవ్వవలెనటరా

(॥కావ॥)
ఆయనాయ నిందరిలో ఆరడేలరా । నీవు
చాయలకు మొక్కఁగానే చాలునంటిరా
పోయినపొద్దులు వోయఁ బొందకుండేమా । నీవు
చేయి మించి ఇంతలోనే చెనకనేఁటికిరా

(॥కావ॥)
కంటిఁగంటి నీమాట కల్ల గాదురా । నీవే
ఇంటికి వచ్చితి వన్నీ నియ్యకొంటిరా
నంటున శ్రీవేంకటేశ నన్నుఁ గూడితి । ఇఁక
బంటు పంతమా ఇది ప్రతిన లేఁటికిరా

(||pallavi||)
kāvalasina panulu kāgamānīnā nīvu
kāvarāna mugum̐dāḍa kāluguchchevelarā

(||kāva||)
kānī kānī nīvemannām̐ gādanarā | yiṭṭĕ
āniṁchaga piluvavaddaṁṭi miṁterā
menavāvi nīgu nāgu mĕrasĕm̐ dŏllĕ | nem̐ḍĕ
nānam̐bĕṭṭi sĕlavula navvavalĕnaḍarā

(||kāva||)
āyanāya niṁdarilo āraḍelarā | nīvu
sāyalagu mŏkkam̐gāne sālunaṁṭirā
poyinabŏddulu voyam̐ bŏṁdaguṁḍemā | nīvu
seyi miṁchi iṁtalone sĕnaganem̐ṭigirā

(||kāva||)
kaṁṭim̐gaṁṭi nīmāḍa kalla gādurā | nīve
iṁṭigi vachchidi vannī niyyagŏṁṭirā
naṁṭuna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidi | im̐ka
baṁṭu paṁtamā idi pradina lem̐ṭigirā