Kaavagumte nedee gadi kamalaakshaa yimdarigi

కావకుంటే నేదీ గతి కమలాక్షా యిందరికి
Language

(॥పల్లవి॥)
కావకుంటే నేదీ గతి కమలాక్షా యిందరికి
నీవు వుపకారివై నిలిచితి గాకా

(॥కావకుం॥)
జీవు వీడేరే కొఱకు శ్రీరంగవెంకటాద్రి
దేవభూములందు నీ దివ్యమూర్తులు చూపి
వేవేలు నీ గుణములు వేదశాస్త్రములఁ దెల్పి
యీవలా రక్షించేవు నిన్నేమని నుతింతుము

(॥కావకుం॥)
అంతటాఁ బాదతీర్థములైన గంగాదినదులు
పొంతనే యాడాడకు పుణ్యపురుషుల నిల్పి
వంత దీర నేకాదశివ్రతాచారాలు గల్పించి
యెంతెంత ప్రయాసపడే విదే పనై నీవు

(॥కావకుం॥)
నానావిధమంత్రపు నీ నామజపము గల్పించి
ధ్యానము యజ్ఞము మొదలైన పూజలు గడించి
యీ నెపాన శ్రీవేంకటేశ బ్రదుకు మనుచు
కానుకగొని యిచ్చేవు ఘనవరములను

(||pallavi||)
kāvaguṁṭe nedī gadi kamalākṣhā yiṁdarigi
nīvu vubagārivai nilisidi gāgā

(||kāvaguṁ||)
jīvu vīḍere kŏṟagu śhrīraṁgavĕṁkaḍādri
devabhūmulaṁdu nī divyamūrdulu sūbi
vevelu nī guṇamulu vedaśhāstramulam̐ dĕlbi
yīvalā rakṣhiṁchevu ninnemani nudiṁtumu

(||kāvaguṁ||)
aṁtaḍām̐ bādadīrdhamulaina gaṁgādinadulu
pŏṁtane yāḍāḍagu puṇyaburuṣhula nilbi
vaṁta dīra negādaśhivradāsārālu galbiṁchi
yĕṁtĕṁta prayāsabaḍe vide panai nīvu

(||kāvaguṁ||)
nānāvidhamaṁtrabu nī nāmajabamu galbiṁchi
dhyānamu yajñamu mŏdalaina pūjalu gaḍiṁchi
yī nĕbāna śhrīveṁkaḍeśha bradugu manusu
kānugagŏni yichchevu ghanavaramulanu