Kaasugunna dimdula kee kaligi yappadinumdi

కాచుకున్న దిందుల కీ కలికి యప్పటినుండి
Language

(॥పల్లవి॥)
కాచుకున్న దిందుల కీ కలికి యప్పటినుండి
యేచి చనవియ్యరాదా ఇఁకనేల లోఁగను

(॥కాచు॥)
చెప్పరాదా కతలెల్లా చెవులొగ్గి వినీ నాపె
కప్పురపు వాసనల గాఁకదేరను
వొ ప్పి కాఁగిలించరాదా వొడివట్టితీసీ నాపె
చిప్పిలుఁ బెంజేమటలచే నలపారను

(॥కాచు॥)
చేరి విడెమియ్యరాదా చేతులు చాఁచీ నాపె
సారెకు మైసోఁకుల చలివాయను
నేరుపుతో నవ్వరాదా నీ దిక్కు చూచీనాపె
వూరేటి మోవితీపుల నొగి దప్పి వాయను

(॥కాచు॥)
పంతముతోఁ జాఁచరాదా పాదములొత్తీ నాపె
మంతనపుఁజేఁతల మనసారను
ఇంతలో శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సంతోసమే పెంచరాదా చవులెల్లా రేఁగలు

(||pallavi||)
kāsugunna diṁdula kī kaligi yappaḍinuṁḍi
yesi sanaviyyarādā im̐kanela lom̐ganu

(||kāsu||)
sĕpparādā kadalĕllā sĕvulŏggi vinī nābĕ
kappurabu vāsanala gām̐kaderanu
vŏ ppi kām̐giliṁcharādā vŏḍivaṭṭidīsī nābĕ
sippilum̐ bĕṁjemaḍalase nalabāranu

(||kāsu||)
seri viḍĕmiyyarādā sedulu sām̐sī nābĕ
sārĕgu maisom̐kula salivāyanu
nerubudo navvarādā nī dikku sūsīnābĕ
vūreḍi movidībula nŏgi dappi vāyanu

(||kāsu||)
paṁtamudom̐ jām̐sarādā pādamulŏttī nābĕ
maṁtanabum̐jem̐tala manasāranu
iṁtalo śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
saṁtosame pĕṁcharādā savulĕllā rem̐galu