కానుకకుఁ జేయిచాచీ గమ్మటిఁ దాను
(॥పల్లవి॥)
కానుకకుఁ జేయిచాచీ గమ్మటిఁ దాను
నానిన చెమటతో సన్నలు సేసీని
(॥॥)
ఆమనికాలము వచ్చె నంగనవలపు హెచ్చె
యేమని విన్నవింతమే యీతనితోను
కామునమ్ములు వాఁడెక్కె కమ్మటిఁ జిగురులు నిక్కె
నాములువారఁ దా నింక నవ్వులు నవ్వీని
(॥॥)
చందురుఁడు నుదయించె జవ్వన మీ కెకు మించె
కందు వేడ జూపుదమే కాంతునికి
మందమారుతము రేఁగె మలసి యలులు మూఁగె
చెంది మోము చూచితేనే సిగ్గులువడీని
(॥॥)
కోకము లొద్దికిఁ జేరె గుబ్బచన్నుఁ గవ మీరె
చేకూరిచే దెట్లానే శ్రీవేంకటేశు
దాకొనె నిద్దరిసొంపు దైవారె రతులముంపు
కై కొని పొగడితేనే కళలుదేరీని
(||pallavi||)
kānugagum̐ jeyisāsī gammaḍim̐ dānu
nānina sĕmaḍado sannalu sesīni
(||||)
āmanigālamu vachchĕ naṁganavalabu hĕchchĕ
yemani vinnaviṁtame yīdanidonu
kāmunammulu vām̐ḍĕkkĕ kammaḍim̐ jigurulu nikkĕ
nāmuluvāram̐ dā niṁka navvulu navvīni
(||||)
saṁdurum̐ḍu nudayiṁchĕ javvana mī kĕgu miṁchĕ
kaṁdu veḍa jūbudame kāṁtunigi
maṁdamārudamu rem̐gĕ malasi yalulu mūm̐gĕ
sĕṁdi momu sūsidene sigguluvaḍīni
(||||)
kogamu lŏddigim̐ jerĕ gubbasannum̐ gava mīrĕ
segūrise dĕṭlāne śhrīveṁkaḍeśhu
dāgŏnĕ niddarisŏṁpu daivārĕ radulamuṁpu
kai kŏni pŏgaḍidene kaḽaluderīni