కానుక లందుకోవయ్యా కత లేమి యడిగేవు
(॥పల్లవి॥)
కానుక లందుకోవయ్యా కత లేమి యడిగేవు
మానాపతులము నేము మరి దూరరాము
(॥కాను॥)
వంచన సేయఁగ రాదు వలపు పెట్టనిదొంతి
పొంచి వేసె నింతే చెలి పూవుల బంతి
ముంచిన సిగ్గయితేను మొదలఁ బెట్టనికోట
మించి కాంతల కేపొద్దూ నీమీఁదిదే యాట
(॥కాను॥)
మట్టు లేనితమకము మలసి పారేయేరు
చుట్టి చుట్టి వచ్చి యాకె సోదించె గోరు
దట్టమైనజవ్వనము దాఁటఁగ రానికొండ
నెట్టిన నందరికిని నీవే దాపుదండ
(॥కాను॥)
కలసిన కాఁగిలి కామశాస్త్రపుదొడ్డి
చెలగే పరవశము చీఁకటిదొడ్డి
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి జవరాలి
పిలిచి మో విచ్చినది పెండ్లివోలి
(||pallavi||)
kānuga laṁdugovayyā kada lemi yaḍigevu
mānābadulamu nemu mari dūrarāmu
(||kānu||)
vaṁchana seyam̐ga rādu valabu pĕṭṭanidŏṁti
pŏṁchi vesĕ niṁte sĕli pūvula baṁti
muṁchina siggayidenu mŏdalam̐ bĕṭṭanigoḍa
miṁchi kāṁtala kebŏddū nīmīm̐dide yāḍa
(||kānu||)
maṭṭu lenidamagamu malasi pāreyeru
suṭṭi suṭṭi vachchi yāgĕ sodiṁchĕ goru
daṭṭamainajavvanamu dām̐ṭam̐ga rānigŏṁḍa
nĕṭṭina naṁdarigini nīve dābudaṁḍa
(||kānu||)
kalasina kām̐gili kāmaśhāstrabudŏḍḍi
sĕlage paravaśhamu sīm̐kaḍidŏḍḍi
yĕlami śhrī veṁkaḍeśha yelidivi javarāli
pilisi mo vichchinadi pĕṁḍlivoli