Kaanigaani mechchu sesemgaanee nenu

కానికాని మెచ్చు సేసేఁగానీ నేను
Language

(॥పల్లవి॥)
కానికాని మెచ్చు సేసేఁగానీ నేను
సోనల శ్రీనరసింహ చూడుమీ నేను

(॥కాని॥)
గొంది నీవు వోబుళపుకొండలో వుండేవునికి
ఇందిరతో విన్నవించే నిదివో నేను
చెంది నీవు చేచేతఁ జేసినట్టి ఆగడాలు
అంది యాకెతోనే చెప్పే నప్పటి నేను

(॥కాని ॥)
శిరసువంచి నీవు చిరునవ్వులు నవ్వేది
సిరితో విన్నవించే నంచెలనే నేను
అరుదై నీమేన నిండానానినపెంజెమటలు
ధర నాపె కెరిఁగించేఁ దప్పక నేను

(॥కాని॥)
అమరు నీవాఁడిగోళ్ల అందపువిటతనాలు
కమలతో విన్నవించేఁ గందువ నేను
సమమై శ్రీవేంకటేశ సతిఁ గాఁగిటఁ గూడి నా-
కమర లంచమిచ్చితి వంతదాన

(||pallavi||)
kānigāni mĕchchu sesem̐gānī nenu
sonala śhrīnarasiṁha sūḍumī nenu

(||kāni||)
gŏṁdi nīvu vobuḽabugŏṁḍalo vuṁḍevunigi
iṁdirado vinnaviṁche nidivo nenu
sĕṁdi nīvu sesedam̐ jesinaṭṭi āgaḍālu
aṁdi yāgĕdone sĕppe nappaḍi nenu

(||kāni ||)
śhirasuvaṁchi nīvu sirunavvulu navvedi
sirido vinnaviṁche naṁchĕlane nenu
arudai nīmena niṁḍānāninabĕṁjĕmaḍalu
dhara nābĕ kĕrim̐giṁchem̐ dappaga nenu

(||kāni||)
amaru nīvām̐ḍigoḽla aṁdabuviḍadanālu
kamalado vinnaviṁchem̐ gaṁduva nenu
samamai śhrīveṁkaḍeśha sadim̐ gām̐giḍam̐ gūḍi nā-
kamara laṁchamichchidi vaṁtadāna