Kaani kaani neeguttu gamtigaa nenu

కాని కాని నీగుట్టు గంటిగా నేను
Language

(॥పల్లవి॥)
కాని కాని నీగుట్టు గంటిగా నేను
పానిపట్టి యిఁక నేల పచ్చిదేరీనోయి

(॥కాని॥)
నీమోహపుచెలి పేరు నేనేయంటాఁ జెప్పి నీఁ
దోమతెరమంచములో దొమ్మిఁ గూడఁగా
కామించి యాపెనే యంటా కలసి మర్మములైనఁ
ఆమాట లెల్ల నాతో నాడితిగా వోయి

(॥కాని॥)
ఆపెయెలుఁగుననే నిన్నా యములు సోఁకఁ దిట్టి
తోవునఁ బాదాన నిన్నఁ దోయఁగను
ఆపెనే యనుచు నాయడుగుల కటు మొక్కి
యేపున నెన్నైన బాస లిచ్చితిగా వోయి

(॥కాని॥)
రతి యాకె సెసినట్టే రమణఁ జేసి నావాఁ
గతుల నీమనసెల్లఁ గరఁగించఁగా
యితవై శ్రీవేంకటేశ యిచ్చితివి సొమ్ము లెల్లా
కతగా నాపెసొమ్మిందు గలసెఁగా వోయి

(||pallavi||)
kāni kāni nīguṭṭu gaṁṭigā nenu
pānibaṭṭi yim̐ka nela pachchiderīnoyi

(||kāni||)
nīmohabusĕli peru neneyaṁṭām̐ jĕppi nīm̐
domadĕramaṁchamulo dŏmmim̐ gūḍam̐gā
kāmiṁchi yābĕne yaṁṭā kalasi marmamulainam̐
āmāḍa lĕlla nādo nāḍidigā voyi

(||kāni||)
ābĕyĕlum̐gunane ninnā yamulu som̐kam̐ diṭṭi
tovunam̐ bādāna ninnam̐ doyam̐ganu
ābĕne yanusu nāyaḍugula kaḍu mŏkki
yebuna nĕnnaina bāsa lichchidigā voyi

(||kāni||)
radi yāgĕ sĕsinaṭṭe ramaṇam̐ jesi nāvām̐
gadula nīmanasĕllam̐ garam̐giṁcham̐gā
yidavai śhrīveṁkaḍeśha yichchidivi sŏmmu lĕllā
kadagā nābĕsŏmmiṁdu galasĕm̐gā voyi