Kaani amdugemaayam gadavaaramaa

కాని అందుకేమాయఁ గడవారమా
Language

(॥పల్లవి॥)
కాని అందుకేమాయఁ గడవారమా
పూని యీకరుణ యెట్లాఁ బుట్టెనో నీకు

(॥॥)
చేతికిఁ గానుకిచ్చితే సిగ్గువడే వేమయ్య
ఆతల నీ కేమితలఁ పాయనో నేఁడు
యీతల మొక్కఁగా శిరనేల వంచేవేమయ్య
కాతరపునేర మెట్టుగలిగెనో నీకు

(॥॥)
నంటున వీడెమిచ్చితే నవ్వు నవ్వే వేమయ్య
జంటల నేమిటివంక సరిదాఁకెనో
అంటి సేవసేసితేనే అలసే విదేమయ్య
యింటిలో నాచన్నులవేఁ గెట్టుండెనో నీకు

(॥॥)
వొద్దికఁ బెనఁగితే నిట్టూర్పు నించేవేమయ్య
గద్దరిచిత్త మెట్టులఁ గరఁగినదో
ముద్దులశ్రీవేంకటేశ ముంచి కూడితి వొనయ్య
పొద్దు వొద్దు కాస లెట్టు పొసఁగెనో నీకు

(||pallavi||)
kāni aṁdugemāyam̐ gaḍavāramā
pūni yīgaruṇa yĕṭlām̐ buṭṭĕno nīgu

(||||)
sedigim̐ gānugichchide sigguvaḍe vemayya
ādala nī kemidalam̐ pāyano nem̐ḍu
yīdala mŏkkam̐gā śhiranela vaṁchevemayya
kādarabunera mĕṭṭugaligĕno nīgu

(||||)
naṁṭuna vīḍĕmichchide navvu navve vemayya
jaṁṭala nemiḍivaṁka saridām̐kĕno
aṁṭi sevasesidene alase videmayya
yiṁṭilo nāsannulavem̐ gĕṭṭuṁḍĕno nīgu

(||||)
vŏddigam̐ bĕnam̐gide niṭṭūrbu niṁchevemayya
gaddarisitta mĕṭṭulam̐ garam̐ginado
muddulaśhrīveṁkaḍeśha muṁchi kūḍidi vŏnayya
pŏddu vŏddu kāsa lĕṭṭu pŏsam̐gĕno nīgu