(॥పల్లవి॥)
కానీవోయి అందుకేమి కడపరాయ
కానవచ్చె నీపనులు కడపరాయా
(॥కానీ॥)
కప్పురమియ్యఁగదోయి కడపరాయ
కప్పవోయి పచ్చడము కడపరాయ
కప్పమివే మాచన్నులు కడపరాయ నీకు
కప్పులు మోవి నున్నవి కడపరాయ
(॥కానీ॥)
కాలు దాఁకించకు మంత కడపరాయ
గాలపుచూపులు మాని కడపరాయ
కాలమందె నీవారము కడపరాయ మాలో
కైలాటాలు వెట్టుమీ కడపరాయ
(॥కానీ॥)
కందులేని వలపుల కడపరాయ
గందము మామేననిదే కడపరాయ
కందర్పజనక వోకడపరాయ
కందువ శ్రీవేంకటాద్రి కడపరాయా
(||pallavi||)
kānīvoyi aṁdugemi kaḍabarāya
kānavachchĕ nībanulu kaḍabarāyā
(||kānī||)
kappuramiyyam̐gadoyi kaḍabarāya
kappavoyi pachchaḍamu kaḍabarāya
kappamive māsannulu kaḍabarāya nīgu
kappulu movi nunnavi kaḍabarāya
(||kānī||)
kālu dām̐kiṁchagu maṁta kaḍabarāya
gālabusūbulu māni kaḍabarāya
kālamaṁdĕ nīvāramu kaḍabarāya mālo
kailāḍālu vĕṭṭumī kaḍabarāya
(||kānī||)
kaṁduleni valabula kaḍabarāya
gaṁdamu māmenanide kaḍabarāya
kaṁdarbajanaga vogaḍabarāya
kaṁduva śhrīveṁkaḍādri kaḍabarāyā