కానీవే యెందు పొయ్యేము కందము తననేమము
(॥పల్లవి॥)
కానీవే యెందు పొయ్యేము కందము తననేమము
తానే పంతములు పాఁతరఁ బెట్టకుండీనా
(॥కానీ॥)
పిలిచితే రాఁ డట్టే బిగిసీ నీపాటి వాఁడు
చెలఁగి మనసు రాయి సేయకుండీనా
సెలవుల నగినాను చేరి అది యేలనఁడు
తెలిసి వూవుటమ్ములు తెగఁ గోయకుండీనా
(॥కానీ॥)
కానుకిచ్చితే నొల్లఁడు కపటమంత గలితే
దీనకాన వలపు ముద్రించకుండీనా
వీనులలర నే విన్నవించినాను వూఁకొనఁడు
మానినుల జవ్వనాలు మాన్పకుండీనా
(॥కానీ॥)
కదిసితేఁ బైకొనఁడు కాఁకలింత సేసేవాఁడు
కదలించి మరు నుట్టిఁగట్టకుండీనా
ఇదివో శ్రీవేంకటేశుఁ డెనసితే మన్నించె
పెదవితేనె చక్కెరబిల్ల సేయకుండీనా
(||pallavi||)
kānīve yĕṁdu pŏyyemu kaṁdamu tananemamu
tāne paṁtamulu pām̐taram̐ bĕṭṭaguṁḍīnā
(||kānī||)
piliside rām̐ ḍaṭṭe bigisī nībāḍi vām̐ḍu
sĕlam̐gi manasu rāyi seyaguṁḍīnā
sĕlavula naginānu seri adi yelanam̐ḍu
tĕlisi vūvuḍammulu tĕgam̐ goyaguṁḍīnā
(||kānī||)
kānugichchide nŏllam̐ḍu kabaḍamaṁta galide
dīnagāna valabu mudriṁchaguṁḍīnā
vīnulalara ne vinnaviṁchinānu vūm̐kŏnam̐ḍu
māninula javvanālu mānpaguṁḍīnā
(||kānī||)
kadisidem̐ baigŏnam̐ḍu kām̐kaliṁta sesevām̐ḍu
kadaliṁchi maru nuṭṭim̐gaṭṭaguṁḍīnā
idivo śhrīveṁkaḍeśhum̐ ḍĕnaside manniṁchĕ
pĕdavidenĕ sakkĕrabilla seyaguṁḍīnā