Kaaneeve tana vesaalu kanumgomtim gaa

కానీవే తన వేసాలు కనుఁగొంటిఁ గా
Language

(॥పల్లవి॥)
కానీవే తన వేసాలు కనుఁగొంటిఁ గా
వీనులకు యీ సుద్దులు వెరగాయఁగా

(॥కానీవే॥)
చెప్పరే చెప్పరే వీనిచేఁతలు నాకు
అప్పుడే యాపెతో మాట లాడి వచ్చెవా
ముప్పిరి నా కిఁక నేఁటి మొకమోటమే
తప్పని బొంకనివాఁడు తా నెందు వోయీనే

(॥కానీవే॥)
యెంత కెంత వీనిసుద్దు లేల దాఁచేరే
దొంతిగా నాపెను వెంటఁ దోడి తెచ్చెనా
పంతపుమోనము లిఁకఁ బనికి రావె
సంతసమే చేసేఁ గాక జగడించేనా

(॥కానీవే॥)
యే మంటి రే మంటిరే యెఱఁగ నేను
చే మట్టి యాపెను నాచేతి కిచ్చెనా
కామించి శ్రీవెంకటాద్రికడపరాయఁడు నన్ను
గోమునఁ గూడె నిదియుఁ గొంత వలెనా

(||pallavi||)
kānīve tana vesālu kanum̐gŏṁṭim̐ gā
vīnulagu yī suddulu vĕragāyam̐gā

(||kānīve||)
sĕppare sĕppare vīnisem̐talu nāgu
appuḍe yābĕdo māḍa lāḍi vachchĕvā
muppiri nā kim̐ka nem̐ṭi mŏgamoḍame
tappani bŏṁkanivām̐ḍu tā nĕṁdu voyīne

(||kānīve||)
yĕṁta kĕṁta vīnisuddu lela dām̐sere
dŏṁtigā nābĕnu vĕṁṭam̐ doḍi tĕchchĕnā
paṁtabumonamu lim̐kam̐ banigi rāvĕ
saṁtasame sesem̐ gāga jagaḍiṁchenā

(||kānīve||)
ye maṁṭi re maṁṭire yĕṟam̐ga nenu
se maṭṭi yābĕnu nāsedi kichchĕnā
kāmiṁchi śhrīvĕṁkaḍādrigaḍabarāyam̐ḍu nannu
gomunam̐ gūḍĕ nidiyum̐ gŏṁta valĕnā