Kaaneeve taanaadinatte kaigomti nenu

కానీవే తానాడినట్టే కైకొంటి నేను
Language

(॥పల్లవి॥)
కానీవే తానాడినట్టే కైకొంటి నేను
మోనాన నూరక వుండే ముద్దరాల నేను

(॥॥)
చలములవారమో సారెసారె నేము తన
సలిగెల బతికేటి సతులము
పలుకులవారమా పంతమాడి యప్పటిని
చెలిమి సేసుకవుండే చెలులము గాక

(॥॥)
వెంగెములవారమో వేగినంగాఁ దనమోవి
యెంగిలిచవులు గొనే యింతులము
కొంగు వట్టేవారమో కొసరుచు నేపొద్దు
ముంగిటఁ గాచుకుండే ముదితలము

(॥॥)
సాదించే వారమో జంకించి బొమ్మలను
పోదిసేసి కూడేటి పొలఁతులము
ఆదిగొని శ్రీవేంకటాధిపతి నన్నే లె
కాదనేవారమో తనకాఁగిటిలో దానను

(||pallavi||)
kānīve tānāḍinaṭṭe kaigŏṁṭi nenu
monāna nūraga vuṁḍe muddarāla nenu

(||||)
salamulavāramo sārĕsārĕ nemu tana
saligĕla badigeḍi sadulamu
palugulavāramā paṁtamāḍi yappaḍini
sĕlimi sesugavuṁḍe sĕlulamu gāga

(||||)
vĕṁgĕmulavāramo veginaṁgām̐ danamovi
yĕṁgilisavulu gŏne yiṁtulamu
kŏṁgu vaṭṭevāramo kŏsarusu nebŏddu
muṁgiḍam̐ gāsuguṁḍe mudidalamu

(||||)
sādiṁche vāramo jaṁkiṁchi bŏmmalanu
podisesi kūḍeḍi pŏlam̐tulamu
ādigŏni śhrīveṁkaḍādhibadi nanne lĕ
kādanevāramo tanagām̐giḍilo dānanu