Kaaneeve naagemta galigem danagoo namte

కానీవే నాకెంత గలిగెఁ దనకూ నంతే
Language

(॥పల్లవి॥)
కానీవే నాకెంత గలిగెఁ దనకూ నంతే
వూని నానిన సనిగె లొకటి కినుమడి

(॥కానీ॥)
తన కెంతకుచ్చితము తానే బదికీలేవే
మనసంతే మంగళము మాపుదాఁకాను
వనిత నొక్కతె నాతో వడి నీడువెట్టెను
తనకూ నదేకాదా తగవు మీఁదటికి

(॥కానీ॥)
యీసులెంత రేఁచుకొన్నా నెక్కడవోయీలేవే
సేసినసుబాఫలాలు చేతిలోనివే
యీసిరులతో మగని కెందరిఁ బెండ్లిసేసినా
లాసి నావలెనే తనలాబము గాదా

(॥కానీ॥)
తడవి శ్రీవేంకటేశు దక్కనిచ్చె నాకు నేఁడు
నుడుగులఁదే వున్నది నోముఫలము
పఁడతులచేతనెల్లా పంతము నాకిప్పించితే
కడఁగి తనపెద్దరికముగాదా యిఁకను

(||pallavi||)
kānīve nāgĕṁta galigĕm̐ danagū naṁte
vūni nānina sanigĕ lŏgaḍi kinumaḍi

(||kānī||)
tana kĕṁtaguchchidamu tāne badigīleve
manasaṁte maṁgaḽamu mābudām̐kānu
vanida nŏkkadĕ nādo vaḍi nīḍuvĕṭṭĕnu
tanagū nadegādā tagavu mīm̐daḍigi

(||kānī||)
yīsulĕṁta rem̐sugŏnnā nĕkkaḍavoyīleve
sesinasubāphalālu sedilonive
yīsirulado magani kĕṁdarim̐ bĕṁḍlisesinā
lāsi nāvalĕne tanalābamu gādā

(||kānī||)
taḍavi śhrīveṁkaḍeśhu dakkanichchĕ nāgu nem̐ḍu
nuḍugulam̐de vunnadi nomuphalamu
pam̐ḍadulasedanĕllā paṁtamu nāgippiṁchide
kaḍam̐gi tanabĕddarigamugādā yim̐kanu