కానీవే గొల్లెతా కమ్మటి నవ్వకువే
(॥పల్లవి॥)
కానీవే గొల్లెతా కమ్మటి నవ్వకువే
నాననీవే రేపటికి నయమవును దాఁచవే
(॥॥)
తీపుచేసి వలపులు తీర నాపైఁ జల్లకువే
పోపో నీగొల్లచల్ల పుల్లనేకాదా
మాపటంత వచ్చేఁగాని మగుడి చూడకువే
చేపట్టి చూడఁజూడఁగ చీఁకటిండ్లే వెలుఁగు
(॥॥)
మాటలనే నా మీఁద మందులు నూరకువే
మూటగట్టితే గొల్లముంజులేకావా
చీటికిమాటికి నాపై చేతులు చాఁచకువే
వాఁటమైతే నీరు వారు వచ్చే నే నాడకు
(॥॥)
చేయివట్టి తియ్యకువే చేరి నన్ను లోనికి
పాయపు గొల్లెతలకు బలువేకదా
వేయిటికిఁ గూడితి శ్రీ వేంకటేశుఁడను నేను
యీయెడ జాతొకటాయ నింటికి వచ్చేనే
(||pallavi||)
kānīve gŏllĕdā kammaḍi navvaguve
nānanīve rebaḍigi nayamavunu dām̐save
(||||)
tībusesi valabulu tīra nābaim̐ jallaguve
pobo nīgŏllasalla pullanegādā
mābaḍaṁta vachchem̐gāni maguḍi sūḍaguve
sebaṭṭi sūḍam̐jūḍam̐ga sīm̐kaḍiṁḍle vĕlum̐gu
(||||)
māḍalane nā mīm̐da maṁdulu nūraguve
mūḍagaṭṭide gŏllamuṁjulegāvā
sīḍigimāḍigi nābai sedulu sām̐saguve
vām̐ṭamaide nīru vāru vachche ne nāḍagu
(||||)
seyivaṭṭi tiyyaguve seri nannu lonigi
pāyabu gŏllĕdalagu baluvegadā
veyiḍigim̐ gūḍidi śhrī veṁkaḍeśhum̐ḍanu nenu
yīyĕḍa jādŏgaḍāya niṁṭigi vachchene