కానీవే గొల్లెతా గబ్బిగొల్లెతా
(॥పల్లవి॥)
కానీవే గొల్లెతా గబ్బిగొల్లెతా
ఆనుక తెలుసుకొంటి వవునవురా గొల్లఁడా
(॥॥)
పంతకారిగొల్లెతా పదరకు గొల్లెతా
రంతుల నట్టేకానీరా గొల్లఁ డా
యింత గట్టు వాయవౌత యెరిఁగితినే నేను
సంతలోనె వింటిరా నీసాదుఁదనాలెల్లను
(॥॥)
మతకారిగొల్లెతా మంకులాఁడిగొల్లెతా
రతులకు మా యింటికి రారా గొల్లఁడా
కతకారివౌత ఇట్టె కానవచ్చెనే నేఁడు
చతురతలు మోమున జడి సేరా నీకును
(॥॥)
చనవరిగొల్లెతా చనవిమ్మా గొల్లెతా
కెలయకు శ్రీ వేంకటగిరిగొల్లఁడా
పొలఁతు లందరు నేఁడు పొగడేరే నిన్నును
కలపితి వౌర నిన్ను కమ్మటి మెచ్చితిని
(||pallavi||)
kānīve gŏllĕdā gabbigŏllĕdā
ānuga tĕlusugŏṁṭi vavunavurā gŏllam̐ḍā
(||||)
paṁtagārigŏllĕdā padaragu gŏllĕdā
raṁtula naṭṭegānīrā gŏllam̐ ḍā
yiṁta gaṭṭu vāyavauda yĕrim̐gidine nenu
saṁtalonĕ viṁṭirā nīsādum̐danālĕllanu
(||||)
madagārigŏllĕdā maṁkulām̐ḍigŏllĕdā
radulagu mā yiṁṭigi rārā gŏllam̐ḍā
kadagārivauda iṭṭĕ kānavachchĕne nem̐ḍu
saduradalu momuna jaḍi serā nīgunu
(||||)
sanavarigŏllĕdā sanavimmā gŏllĕdā
kĕlayagu śhrī veṁkaḍagirigŏllam̐ḍā
pŏlam̐tu laṁdaru nem̐ḍu pŏgaḍere ninnunu
kalabidi vaura ninnu kammaḍi mĕchchidini