కానీవే దాని కేమి కందము నీ పంతము
(॥పల్లవి॥)
కానీవే దాని కేమి కందము నీ పంతము
మేనరిక మయిన వావి మీరఁగలవా
(॥కానీ॥)
చేలకొంగు వట్టితేనే చీఁదర రేఁగేదానవు
కాలుదొక్కితే నెంత కాఁతాళింతువో
తాలిమి గోర నూఁదితే తప్పించుకొనేదానవు
మేలమాడి పెనఁగితే మేకు లెంత సేతువో
(॥కానీ॥)
కన్నులఁజూచితేనే కసరేటిదానవు
చన్ను లంటితే నెంతసళుపుదువో
సన్నలు సేసితేనే జంకించేదానవు
చిన్నినవ్వు నవ్వితేనే సిగ్గెంత వడుదువో
(॥కానీ॥)
మోవితేనె లడిగితేనే మొరసేటిదానవు
యీవేళఁగాఁగిలించితే నేమందువో
నీ వల మేలుమంగపు నేను శ్రీవేంకటేశుఁడ
చేవదేరెఁ గూటములు చేఁత లెంత సేతువో
(||pallavi||)
kānīve dāni kemi kaṁdamu nī paṁtamu
menariga mayina vāvi mīram̐galavā
(||kānī||)
selagŏṁgu vaṭṭidene sīm̐dara rem̐gedānavu
kāludŏkkide nĕṁta kām̐tāḽiṁtuvo
tālimi gora nūm̐dide tappiṁchugŏnedānavu
melamāḍi pĕnam̐gide megu lĕṁta seduvo
(||kānī||)
kannulam̐jūsidene kasareḍidānavu
sannu laṁṭide nĕṁtasaḽubuduvo
sannalu sesidene jaṁkiṁchedānavu
sinninavvu navvidene siggĕṁta vaḍuduvo
(||kānī||)
movidenĕ laḍigidene mŏraseḍidānavu
yīveḽam̐gām̐giliṁchide nemaṁduvo
nī vala melumaṁgabu nenu śhrīveṁkaḍeśhum̐ḍa
sevaderĕm̐ gūḍamulu sem̐ta lĕṁta seduvo