Kaaneeve amdugemi kallaledu naayamdu

కానీవే అందుకేమి కల్లలేదు నాయందు
Language

(॥పల్లవి॥)
కానీవే అందుకేమి కల్లలేదు నాయందు
దానికేరా నీ కల్లకు తతిరాదు యిఁకను

(॥కానీ॥)
అందుకేవే గొల్లెతా ఆసలివే కానుక
కందువవుర నీచేఁత కానుక గాదా
నిందలేల వేసేవే నెలఁతల నడుగవే
సందడిలో నేమనినా సాకిరులుగావా

(॥కానీ॥)
పుచ్చు కోవే లంచమూ పోరచి కెమ్మావితేనె
లచ్చనపలు సోఁకులే లంచములౌరా
పచ్చిసేయకువే నీవు పనులు గలవు మీఁద
పచ్చని మోముకళలు పాలుగారీఁగదరా

(॥కానీ॥)
ఇయ్యకోవే వలపూ ఇవివో మచ్చికలు
ఇయ్యకొంటిరా తొల్లె ఇన్నిటా నిన్ను
ముయ్యకువే నీమెచ్చు ముసిముసినవ్వులను
యియ్యెడ శ్రీవేంకటేశ యిదివో మెచ్చితిరా

(||pallavi||)
kānīve aṁdugemi kallaledu nāyaṁdu
dānigerā nī kallagu tadirādu yim̐kanu

(||kānī||)
aṁdugeve gŏllĕdā āsalive kānuga
kaṁduvavura nīsem̐ta kānuga gādā
niṁdalela veseve nĕlam̐tala naḍugave
saṁdaḍilo nemaninā sāgirulugāvā

(||kānī||)
puchchu kove laṁchamū porasi kĕmmāvidenĕ
lachchanabalu som̐kule laṁchamulaurā
pachchiseyaguve nīvu panulu galavu mīm̐da
pachchani momugaḽalu pālugārīm̐gadarā

(||kānī||)
iyyagove valabū ivivo machchigalu
iyyagŏṁṭirā tŏllĕ inniḍā ninnu
muyyaguve nīmĕchchu musimusinavvulanu
yiyyĕḍa śhrīveṁkaḍeśha yidivo mĕchchidirā