కానీవే అందు కేమీ కనుకొనే పను లెల్ల
(॥పల్లవి॥)
కానీవే అందు కేమీ కనుకొనే పను లెల్ల
యీ నాటకములు నే నెఱఁగనివా
(॥॥)
పంతము లాడిన తానే భ్రమసీఁ గాక నాకు
యింతలోనె యేమి దప్పె నెందు వోయీని
వింత యడవులవెంట వెదకఁడా సీతఁ దొల్లి
యెంత లేదు తన గుండె యెఱఁ గనిదా
(॥॥)
బిగియుచు నున్న వాఁడే బిలిచీఁ గాక నన్ను
తగవులే నెరపేను దాని కేమే
వెగటయి రాధాదేవి వెంట వెంటఁ దిరుగఁడా
యెగువనె తన గుట్టు యెఱఁగనిదా
(॥॥)
కడలనున్న వాఁడే కలసీఁగాక నన్ను
తడవకు వాని నిట్టె తతి రానీవే
అడరి శ్రీ వేంకటేశుఁడట్టె నన్నుఁ గలసె
యెడయకున్నాఁడు నే నిది యెఱఁగనిదా.
(||pallavi||)
kānīve aṁdu kemī kanugŏne panu lĕlla
yī nāḍagamulu ne nĕṟam̐ganivā
(||||)
paṁtamu lāḍina tāne bhramasīm̐ gāga nāgu
yiṁtalonĕ yemi dappĕ nĕṁdu voyīni
viṁta yaḍavulavĕṁṭa vĕdagam̐ḍā sīdam̐ dŏlli
yĕṁta ledu tana guṁḍĕ yĕṟam̐ ganidā
(||||)
bigiyusu nunna vām̐ḍe bilisīm̐ gāga nannu
tagavule nĕrabenu dāni keme
vĕgaḍayi rādhādevi vĕṁṭa vĕṁṭam̐ dirugam̐ḍā
yĕguvanĕ tana guṭṭu yĕṟam̐ganidā
(||||)
kaḍalanunna vām̐ḍe kalasīm̐gāga nannu
taḍavagu vāni niṭṭĕ tadi rānīve
aḍari śhrī veṁkaḍeśhum̐ḍaṭṭĕ nannum̐ galasĕ
yĕḍayagunnām̐ḍu ne nidi yĕṟam̐ganidā.