Kaaneevayyaa suttaalamai kaligidivi mide nee

కానీవయ్యా చుట్టాలమై కలిగితివి మిదె నీ
Language

(॥పల్లవి॥)
కానీవయ్యా చుట్టాలమై కలిగితివి మిదె నీ
వీనులకు చవులు నీవేడుకలే కావా

(॥॥)
తగవులు చేప్పేవు తరుణికి నాకును
మగడవు నీవేకావా మాకిద్దరికి
వెగటు దీర సరిగా విడెములు వెట్టేవు
జిగిమించ నిన్నియు నీచేఁతలే కావా

(॥॥)
వొడివట్టి మొక్కించేవు వొకరొకరిని మాలో
నడుమ నీవే కావా నాయఁగాడవు
తొడిఁబడ నీవిట్టె పొత్తులఁ గూచుండు మనేవు
జడిగొన్న నీగుణాల సహజమే కాదా

(॥॥)
వొగ్గి కాఁగిటిలో మమ్ము నొద్దికతోఁ గూడేవు
సిగ్గులు నీవే కావా శ్రీవేంకటేశా
తగ్గులేకుండా మమ్ము దయతో మన్నించితివి
వెగ్గళమై నీకుఁ గల విద్య లివే కావా

(||pallavi||)
kānīvayyā suṭṭālamai kaligidivi midĕ nī
vīnulagu savulu nīveḍugale kāvā

(||||)
tagavulu seppevu taruṇigi nāgunu
magaḍavu nīvegāvā māgiddarigi
vĕgaḍu dīra sarigā viḍĕmulu vĕṭṭevu
jigimiṁcha ninniyu nīsem̐tale kāvā

(||||)
vŏḍivaṭṭi mŏkkiṁchevu vŏgarŏgarini mālo
naḍuma nīve kāvā nāyam̐gāḍavu
tŏḍim̐baḍa nīviṭṭĕ pŏttulam̐ gūsuṁḍu manevu
jaḍigŏnna nīguṇāla sahajame kādā

(||||)
vŏggi kām̐giḍilo mammu nŏddigadom̐ gūḍevu
siggulu nīve kāvā śhrīveṁkaḍeśhā
tagguleguṁḍā mammu dayado manniṁchidivi
vĕggaḽamai nīgum̐ gala vidya live kāvā