కానీవయ్యా సంతోసము కడు నీకైతేఁ జాలు
(॥పల్లవి॥)
కానీవయ్యా సంతోసము కడు నీకైతేఁ జాలు
నే నీ చెప్పినట్టు సేసే నీ మాటలోదానను
(॥కానీ॥)
పడఁతిసుద్దులు నీవు పలుమారుఁ జెప్పఁగాను
విడువకేపోద్దూ మాకు వినవలెఁగా
తడవి యాపెగుణాలు తలపొసి పొగడఁగా
జడియ కందులకు మెచ్చఁగవలెఁగా
(॥కానీ॥)
వెగటులే కాపె నీవు వినోదము లాడఁగాను
నగవురాకున్నా మాకు నగవలెఁగా
తగిలి నీ వింతేసి పెద్దరికము సేయఁగాను
మొగమోటమున మేము మొక్కవలెఁగా
(॥కానీ॥)
చెలఁగి యాపె నీవు సేసలు చల్లుకోఁగా
బలిమి నేము సొబానఁ బాడవలెఁగా
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
యెలమి నన్నేలితివి యియ్యకొనవలెఁగా
(||pallavi||)
kānīvayyā saṁtosamu kaḍu nīgaidem̐ jālu
ne nī sĕppinaṭṭu sese nī māḍalodānanu
(||kānī||)
paḍam̐tisuddulu nīvu palumārum̐ jĕppam̐gānu
viḍuvageboddū māgu vinavalĕm̐gā
taḍavi yābĕguṇālu talabŏsi pŏgaḍam̐gā
jaḍiya kaṁdulagu mĕchcham̐gavalĕm̐gā
(||kānī||)
vĕgaḍule kābĕ nīvu vinodamu lāḍam̐gānu
nagavurāgunnā māgu nagavalĕm̐gā
tagili nī viṁtesi pĕddarigamu seyam̐gānu
mŏgamoḍamuna memu mŏkkavalĕm̐gā
(||kānī||)
sĕlam̐gi yābĕ nīvu sesalu sallugom̐gā
balimi nemu sŏbānam̐ bāḍavalĕm̐gā
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
yĕlami nannelidivi yiyyagŏnavalĕm̐gā