Kaaneevayyaa daanigemi kaladi galattayyee

కానీవయ్యా దానికేమి కలది గలట్టయ్యీ
Language

(॥పల్లవి॥)
కానీవయ్యా దానికేమి కలది గలట్టయ్యీ
ఆనుక నీకింక నెంత ఆసోదమో

(॥కానీ॥)
పొలఁతి నయమంటేను పూఁటలు నన్నడిగేవు
తెలిపిన రతియప్పు తిద్దఁగలనా
యెలమి నాకె వలపు యెరవు నాపైఁ బెట్టేవు
చెలులకింకానెంతేసి సిగ్గువాట్లో

(॥కానీ॥)
వాడిక యింతికిఁ గుదువగా నన్నుండు మనేవు
కూడి వావి విడిపించుకొనఁగవసమా
మాడలవలె సతుల మారిపిళ్ళాడేవు
తోడనిట్టేయందరిని దొడ్డిఁబెట్టేవో

(॥కానీ॥)
కొమ్మను గాఁగిటఁ గూడి కొసరు నన్నడిగేవు
కమ్మర నేనూఁ దగులు గావలెనా
దొమ్మి శ్రీ వెంకటేశుఁడ తోడఁబెండ్లాడేవు
మమ్మిద్దరి నిక్కడనే మండెమురాయఁడవై

(||pallavi||)
kānīvayyā dānigemi kaladi galaṭṭayyī
ānuga nīgiṁka nĕṁta āsodamo

(||kānī||)
pŏlam̐ti nayamaṁṭenu pūm̐ṭalu nannaḍigevu
tĕlibina radiyappu tiddam̐galanā
yĕlami nāgĕ valabu yĕravu nābaim̐ bĕṭṭevu
sĕlulagiṁkānĕṁtesi sigguvāṭlo

(||kānī||)
vāḍiga yiṁtigim̐ guduvagā nannuṁḍu manevu
kūḍi vāvi viḍibiṁchugŏnam̐gavasamā
māḍalavalĕ sadula māribiḽḽāḍevu
toḍaniṭṭeyaṁdarini dŏḍḍim̐bĕṭṭevo

(||kānī||)
kŏmmanu gām̐giḍam̐ gūḍi kŏsaru nannaḍigevu
kammara nenūm̐ dagulu gāvalĕnā
dŏmmi śhrī vĕṁkaḍeśhum̐ḍa toḍam̐bĕṁḍlāḍevu
mammiddari nikkaḍane maṁḍĕmurāyam̐ḍavai