కానీవయ్యా దాని కేమి కలది గలట్టయీని
(॥పల్లవి॥)
కానీవయ్యా దాని కేమి కలది గలట్టయీని
ఆనుకొని యింకా నెంత ఆసోదమో
(॥కానీ॥)
పొలఁతి నంపు మంటేను పూఁటలు న న్నడిగేవు
తెలిసి నిరతి యప్పు దిద్దఁ గలనా
యెలమి నాపెవలపు యెరవు నాపైఁ బెట్టేవు
చెలుల కింకా నెంత సిగ్గు వాట్లో
(॥కానీ॥)
వాడికెయింతికి కుదువగా న న్నుండు మనేవు
కూడి వావి విడిపించుకొనీ వశమా
మాడలవలె సతుల మారుపె ళ్ళాడేవు
తోడ నిట్టె యెందరిని దొడ్డిఁ బెట్టేవో
(॥కానీ॥)
కొమ్మను కౌఁగిటఁ గూడి కొసరు న న్నడిగేవు
కమ్మరఁ దగులు నేను కావలెనా
దొమ్మి శ్రీవేంకటేశుఁడ తోడఁ బెండ్లాడేవు
మ మ్మిందరిని ఇక్కడ మండెమురాయఁడవై
(||pallavi||)
kānīvayyā dāni kemi kaladi galaṭṭayīni
ānugŏni yiṁkā nĕṁta āsodamo
(||kānī||)
pŏlam̐ti naṁpu maṁṭenu pūm̐ṭalu na nnaḍigevu
tĕlisi niradi yappu diddam̐ galanā
yĕlami nābĕvalabu yĕravu nābaim̐ bĕṭṭevu
sĕlula kiṁkā nĕṁta siggu vāṭlo
(||kānī||)
vāḍigĕyiṁtigi kuduvagā na nnuṁḍu manevu
kūḍi vāvi viḍibiṁchugŏnī vaśhamā
māḍalavalĕ sadula mārubĕ ḽḽāḍevu
toḍa niṭṭĕ yĕṁdarini dŏḍḍim̐ bĕṭṭevo
(||kānī||)
kŏmmanu kaum̐giḍam̐ gūḍi kŏsaru na nnaḍigevu
kammaram̐ dagulu nenu kāvalĕnā
dŏmmi śhrīveṁkaḍeśhum̐ḍa toḍam̐ bĕṁḍlāḍevu
ma mmiṁdarini ikkaḍa maṁḍĕmurāyam̐ḍavai