కానీవయ్యా అందుకేమి కాదనేనా
(॥పల్లవి॥)
కానీవయ్యా అందుకేమి కాదనేనా
మోనాన నుండఁగ నిన్ను మోవనాడేనా
(॥కానీ॥)
పొత్తుల మాఁటలలోనే బువ్వమారగించితిరి
అత్తి మోవులనే విడే లందుకొంటిరి
యెత్తిన చలముతోడ యేల నాతో బొంకేవు
కొత్తలుగ వేరే నిన్నుఁ గోపగించేనా
(॥కానీ॥)
తెలినవ్వు సిగ్గులనే తెరలు వట్టించితివి
తలఁబాలు వోసితివి తమకముల
చలము సాదించి యేల సారె నానలు వెట్టేవు
వెలినుండి వేరే నిన్ను వెంగెమాడేనా
(॥కానీ॥)
గొప్పకుచముల బూజకుండలునుఁ బట్టితివి
పిప్పిఁగాఁగ రతులను పెండ్లాడితివి
ఇప్పుడే శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నెప్పున నాపెకు నీకు నింద గట్టేనా
(||pallavi||)
kānīvayyā aṁdugemi kādanenā
monāna nuṁḍam̐ga ninnu movanāḍenā
(||kānī||)
pŏttula mām̐ṭalalone buvvamāragiṁchidiri
atti movulane viḍe laṁdugŏṁṭiri
yĕttina salamudoḍa yela nādo bŏṁkevu
kŏttaluga vere ninnum̐ gobagiṁchenā
(||kānī||)
tĕlinavvu siggulane tĕralu vaṭṭiṁchidivi
talam̐bālu vosidivi tamagamula
salamu sādiṁchi yela sārĕ nānalu vĕṭṭevu
vĕlinuṁḍi vere ninnu vĕṁgĕmāḍenā
(||kānī||)
gŏppagusamula būjaguṁḍalunum̐ baṭṭidivi
pippim̐gām̐ga radulanu pĕṁḍlāḍidivi
ippuḍe śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
nĕppuna nābĕgu nīgu niṁda gaṭṭenā