కానీవయ్యా అందుకేమి కాదనేమా నిన్నును
(॥పల్లవి॥)
కానీవయ్యా అందుకేమి కాదనేమా నిన్నును
నానఁబెట్టి యందరితో నవ్వేవు నీవు
(॥కానీ॥)
చిత్తము నీకొకవంక చిమ్ముఁ జూపు లొకవంక
మత్తిలి యప్పటి మాతో మాటలాడేవు
బత్తి నీ కెక్కడనని భావించి నమ్మఁగవచ్చు
పొత్తులవిభుఁడవై పొదిగేవు నీవు
(॥కానీ॥)
చెను లొరితోడ చేసన్న లొకరితోడ
పెనఁగులాట నాతో బెరయించేవు
ననుపు నీ కెందునని నలి నేర్పరపవచ్చు
తనివోనిచుట్టమవై తగిలేవే నీవు
(॥కానీ॥)
వలపులు వాడలోన వాడికలు వూరిలోన
కలసేవు నీవే నా కాఁగిటిలోన
యెలమి శ్రీవేంకటేశ ఇంపు లెట్టు గానవచ్చు
తలఁపు కొద్వాఁడవై తనిపేవు నీవు
(||pallavi||)
kānīvayyā aṁdugemi kādanemā ninnunu
nānam̐bĕṭṭi yaṁdarido navvevu nīvu
(||kānī||)
sittamu nīgŏgavaṁka simmum̐ jūbu lŏgavaṁka
mattili yappaḍi mādo māḍalāḍevu
batti nī kĕkkaḍanani bhāviṁchi nammam̐gavachchu
pŏttulavibhum̐ḍavai pŏdigevu nīvu
(||kānī||)
sĕnu lŏridoḍa sesanna lŏgaridoḍa
pĕnam̐gulāḍa nādo bĕrayiṁchevu
nanubu nī kĕṁdunani nali nerbarabavachchu
tanivonisuṭṭamavai tagileve nīvu
(||kānī||)
valabulu vāḍalona vāḍigalu vūrilona
kalasevu nīve nā kām̐giḍilona
yĕlami śhrīveṁkaḍeśha iṁpu lĕṭṭu gānavachchu
talam̐pu kŏdvām̐ḍavai tanibevu nīvu