Kaaneevayyaa amdarigeem galigina samsaarame

కానీవయ్యా అందరికీఁ గలిగిన సంసారమే
Language

(॥పల్లవి॥)
కానీవయ్యా అందరికీఁ గలిగిన సంసారమే
వీనులార నన్నియును వినేము నే మిఁకను

(॥॥)
చెప్పుదురు పతులతో చెలులు తమనేర్పులు
వొప్పి యెంతడియైనా నూఁకొంటేను
నెప్పున నాకెమాటలు నీకు బాఁతై నేఁడున్నవి
వుప్పతించ మాకేల వొడఁబడే మిపుడు

(॥॥)
చూపుదురు తమయెమ్మె సుదతు లెంతవడైనా
ఆపనలకు నాయకుఁ డాసవడితే
పైపైయి నాపెకు నీవు భ్రమసి వున్నాఁడవు
కోపగించ మాకేల కూడి సంతసించేము

(॥॥)
నవ్వుదు రెంత వడైనా ననుపుతో వనితలు
రవ్వగా వలచినట్టి రమణునితొ
యివ్వల శ్రీ వేంకటేశ యేనలమేలుమంగను
చివ్వన మమ్మేలతివి చేరె మాకు రతులు

(||pallavi||)
kānīvayyā aṁdarigīm̐ galigina saṁsārame
vīnulāra nanniyunu vinemu ne mim̐kanu

(||||)
sĕppuduru padulado sĕlulu tamanerbulu
vŏppi yĕṁtaḍiyainā nūm̐kŏṁṭenu
nĕppuna nāgĕmāḍalu nīgu bām̐tai nem̐ḍunnavi
vuppadiṁcha māgela vŏḍam̐baḍe mibuḍu

(||||)
sūbuduru tamayĕmmĕ sudadu lĕṁtavaḍainā
ābanalagu nāyagum̐ ḍāsavaḍide
paibaiyi nābĕgu nīvu bhramasi vunnām̐ḍavu
kobagiṁcha māgela kūḍi saṁtasiṁchemu

(||||)
navvudu rĕṁta vaḍainā nanubudo vanidalu
ravvagā valasinaṭṭi ramaṇunidŏ
yivvala śhrī veṁkaḍeśha yenalamelumaṁganu
sivvana mammeladivi serĕ māgu radulu