Kaaneevayya imkanela kadu ninnu solayamga

కానీవయ్య ఇఁకనేల కడు నిన్ను సొలయఁగ
Language

(॥పల్లవి॥)
కానీవయ్య ఇఁకనేల కడు నిన్ను సొలయఁగ
మోనముతో నుండఁగాను మొక్కఁజెల్లునా

(॥॥)
తలఁపు నిలుపలేక తమితో మాటాడేఁగాక
పిలిచితే రానపుడే ప్రియమున్నదా
కొలమునాలఁ గనక కోరి సేవసేసేఁగాక
అలపు చూపితినప్పుడే ఆయా లంటఁదగవా

(॥॥)
చుట్టపువరుస లెంచి చూచి నీతో నవ్వేఁగాక
అట్టు నిట్టు జునిగేవు ఆసగలదా
పట్టినవ్రతముతోడ పైకొని చెనకేఁగాక
నట్టుకొట్టినపుడే విన్నపములు గలవా

(॥॥)
ఇదె నన్నుఁ గూడఁగాను ఇచ్చకము సేసేఁగాక
వదలితేఁ గాఁగిలి వహి కెక్కీనా
పొదిగి శ్రీ వేంకటేశ పొందులు నమ్మితిఁగాక
కదిసి నీ వున్నప్పుడే కాదనఁగ వచ్చునా

(||pallavi||)
kānīvayya im̐kanela kaḍu ninnu sŏlayam̐ga
monamudo nuṁḍam̐gānu mŏkkam̐jĕllunā

(||||)
talam̐pu nilubalega tamido māḍāḍem̐gāga
piliside rānabuḍe priyamunnadā
kŏlamunālam̐ ganaga kori sevasesem̐gāga
alabu sūbidinappuḍe āyā laṁṭam̐dagavā

(||||)
suṭṭabuvarusa lĕṁchi sūsi nīdo navvem̐gāga
aṭṭu niṭṭu junigevu āsagaladā
paṭṭinavradamudoḍa paigŏni sĕnagem̐gāga
naṭṭugŏṭṭinabuḍe vinnabamulu galavā

(||||)
idĕ nannum̐ gūḍam̐gānu ichchagamu sesem̐gāga
vadalidem̐ gām̐gili vahi kĕkkīnā
pŏdigi śhrī veṁkaḍeśha pŏṁdulu nammidim̐gāga
kadisi nī vunnappuḍe kādanam̐ga vachchunā