కానీవయ్య దానికేమి కైకొంటిని
(॥పల్లవి॥)
కానీవయ్య దానికేమి కైకొంటిని
మానాపతులైనవారు మట్టుపడవలదా
(॥కానీ॥)
కోపమెంత నేనెంత కోరి నీవు మాఁటాడితే
వోపకున్నఁ గొంత కొంత వూఁకొందుఁగాక
తీపుల మగవాఁడవు తేనెలు గురియఁగాను
పైపై వలఁచినవారు భ్రమయక వుందురా
(॥కానీ॥)
పంతమేడ నేనేడ బలిమి నీవు వట్టితే
చింతతో నున్నాఁ జనవు చెల్లింతుఁగాక
బంతినే మగవాఁడవు పాలు నీవు వోయఁగాను
మంతు కెక్క నోరూరక మానుదురా సతులు
(॥కానీ॥)
చలమెట్టు నేనెట్టు సరి నీవు గూడఁగాను
అలిగినా మాని నిన్ను నంటుదుఁగాక
యెలమి శ్రీ వేంకటేశ యింత నీవు మన్నించఁగా
తలఁపు గలుగువారు తమకమే పెంతురు
(||pallavi||)
kānīvayya dānigemi kaigŏṁṭini
mānābadulainavāru maṭṭubaḍavaladā
(||kānī||)
kobamĕṁta nenĕṁta kori nīvu mām̐ṭāḍide
vobagunnam̐ gŏṁta kŏṁta vūm̐kŏṁdum̐gāga
tībula magavām̐ḍavu tenĕlu guriyam̐gānu
paibai valam̐sinavāru bhramayaga vuṁdurā
(||kānī||)
paṁtameḍa neneḍa balimi nīvu vaṭṭide
siṁtado nunnām̐ janavu sĕlliṁtum̐gāga
baṁtine magavām̐ḍavu pālu nīvu voyam̐gānu
maṁtu kĕkka norūraga mānudurā sadulu
(||kānī||)
salamĕṭṭu nenĕṭṭu sari nīvu gūḍam̐gānu
aliginā māni ninnu naṁṭudum̐gāga
yĕlami śhrī veṁkaḍeśha yiṁta nīvu manniṁcham̐gā
talam̐pu galuguvāru tamagame pĕṁturu