కానీవయ్య దానికేమి కాంత యవివేకి గాదు
(॥పల్లవి॥)
కానీవయ్య దానికేమి కాంత యవివేకి గాదు
సానఁబట్టి చూచీని సరిత లన్నియును
(॥కానీ॥)
మంతనాన నీతోను మాటలాడినంతలోనె
పంతము దప్పదుగా పడఁతికిని
సంతసాన నిన్నుఁజూచి సరసమాడినంతలో
దొంతుల కురుకఁడుగా దొరకొని మరుఁడు
(॥కానీ॥)
వరు సెరిఁగి కాచుక వద్దఁ గూచుండి నంతలో
దొరతనము దప్పదు తొయ్యలికిని
విరసములేక నీకు విడె మిచ్చినంతలోనె
కరకరిఁ బెట్టవుగా కప్పురపుటుండలు
(॥కానీ॥)
ననుపుసేసుక నీతో నవ్వి నంతలోననె
తన నేరుపు దప్పదు తరుణికిని
యెనసె శ్రీ వెంకటేశ యిటు నీవాదరించఁగా
పెనపులఁ బెట్టవుగా ప్రేమపువలపులు
(||pallavi||)
kānīvayya dānigemi kāṁta yavivegi gādu
sānam̐baṭṭi sūsīni sarida lanniyunu
(||kānī||)
maṁtanāna nīdonu māḍalāḍinaṁtalonĕ
paṁtamu dappadugā paḍam̐tigini
saṁtasāna ninnum̐jūsi sarasamāḍinaṁtalo
dŏṁtula kurugam̐ḍugā dŏragŏni marum̐ḍu
(||kānī||)
varu sĕrim̐gi kāsuga vaddam̐ gūsuṁḍi naṁtalo
dŏradanamu dappadu tŏyyaligini
virasamulega nīgu viḍĕ michchinaṁtalonĕ
karagarim̐ bĕṭṭavugā kappurabuḍuṁḍalu
(||kānī||)
nanubusesuga nīdo navvi naṁtalonanĕ
tana nerubu dappadu taruṇigini
yĕnasĕ śhrī vĕṁkaḍeśha yiḍu nīvādariṁcham̐gā
pĕnabulam̐ bĕṭṭavugā premabuvalabulu