(॥పల్లవి॥)
కానీవయ్య అందుకేమి కడపరాయ - నేము
కానమా నీచేఁతలెల్లా కడపరాయా
(॥॥)
కప్పరపు నవ్వుల కడపరాయ-నాకు
గప్పవోయి పచ్చడము కడపరాయా
కప్పులు దేరీ నీ మోవిఁ గడపరాయ-యివి
కప్పముగా నెవ్వతిచ్చెఁగడపరాయ
(॥॥)
గరగరని వాఁడవు కడపరాయ-నాకు
గరఁగి వలవవోయి కడపరాయా
కరుణించి నన్నంటఁగాఁ గడపరాయ-నిన్ను
గరిసించే దెవ్వతోయి కడపరాయా
(॥॥)
కలువదండ నీకదె కడపరాయ-నన్ను
గలసితి వింతలోనే కడపరాయా
కలికి శ్రీవేంకటాద్రి కడపరాయ-నీకుఁ
గలదిఁక నెవ్వతోయి కడపరాయా
(||pallavi||)
kānīvayya aṁdugemi kaḍabarāya - nemu
kānamā nīsem̐talĕllā kaḍabarāyā
(||||)
kapparabu navvula kaḍabarāya-nāgu
gappavoyi pachchaḍamu kaḍabarāyā
kappulu derī nī movim̐ gaḍabarāya-yivi
kappamugā nĕvvadichchĕm̐gaḍabarāya
(||||)
garagarani vām̐ḍavu kaḍabarāya-nāgu
garam̐gi valavavoyi kaḍabarāyā
karuṇiṁchi nannaṁṭam̐gām̐ gaḍabarāya-ninnu
garisiṁche dĕvvadoyi kaḍabarāyā
(||||)
kaluvadaṁḍa nīgadĕ kaḍabarāya-nannu
galasidi viṁtalone kaḍabarāyā
kaligi śhrīveṁkaḍādri kaḍabarāya-nīgum̐
galadim̐ka nĕvvadoyi kaḍabarāyā