కానీవయ్య అందు కేమి కాల మిట్టే వుండీనా
(॥పల్లవి॥)
కానీవయ్య అందు కేమి కాల మిట్టే వుండీనా
మాన కెవ్వతె సలిగె మతి నమ్మినాఁడవో
(॥కానీవయ్య॥)
మాట లాడ నాతో నీకు మనసు రా దోమో కాక
పాటించి నేఁ బిలువఁగాఁ బరా కయ్యేవు
చీటికి మాటికిఁ దొల్లి చేసన్నకె వచ్చేవాడఁ
వీటున రాజసాన నీ వెవ్వరిఁ గైకొనవు
(॥కానీవయ్య॥)
నగ నైనఁ గొంత నాతో నంటున దోసమో కాక
మొగము నేఁ జాడఁగానె మోము వంచేవు
అగపడి యేపొద్దు నాయండఁ బాయనివాఁడవు
వెగ టై మావిన్నపాలు వినఁ దీర దాయను
(॥కానీవయ్య॥)
నిండినచలము నాపై నీకు నెంత గద్దో కాక
బెం డైననన్నుఁ గాఁగిట బిగియించేవు
కొండల శ్రీవెంకటేశ కూడి లో నైనవాఁడవు
నిండుకొని యే డవుత నిన్ను నీ వెరఁగవు
(||pallavi||)
kānīvayya aṁdu kemi kāla miṭṭe vuṁḍīnā
māna kĕvvadĕ saligĕ madi namminām̐ḍavo
(||kānīvayya||)
māḍa lāḍa nādo nīgu manasu rā domo kāga
pāḍiṁchi nem̐ biluvam̐gām̐ barā kayyevu
sīḍigi māḍigim̐ dŏlli sesannagĕ vachchevāḍam̐
vīḍuna rājasāna nī vĕvvarim̐ gaigŏnavu
(||kānīvayya||)
naga nainam̐ gŏṁta nādo naṁṭuna dosamo kāga
mŏgamu nem̐ jāḍam̐gānĕ momu vaṁchevu
agabaḍi yebŏddu nāyaṁḍam̐ bāyanivām̐ḍavu
vĕga ṭai māvinnabālu vinam̐ dīra dāyanu
(||kānīvayya||)
niṁḍinasalamu nābai nīgu nĕṁta gaddo kāga
bĕṁ ḍainanannum̐ gām̐giḍa bigiyiṁchevu
kŏṁḍala śhrīvĕṁkaḍeśha kūḍi lo nainavām̐ḍavu
niṁḍugŏni ye ḍavuda ninnu nī vĕram̐gavu