కానీవమ్మ యీ పుణ్యము గట్టుకోవమ్మా
(॥పల్లవి॥)
కానీవమ్మ యీ పుణ్యము గట్టుకోవమ్మా
పూని యాతని కెంతేసి బుద్దులు చెప్పేవు
(॥॥)
నే కాతఁడు రాకుండఁగా నేరము లెంచినవెల్లా
కానుకగాఁ బట్టితివి కాంతునికి
మేనిపై మచ్చము చూచి మెల్లనే నే నవ్వితేను
దానికిఁగా నాతని పంతము రేఁచేవు
(॥॥)
తక్కివుండిన యాతనిఁ దప్పులు వట్టినవెల్లా
అక్కునఁబోసి చూపితి వాతనికిని
వెక్కసపుఁ జెమటకు వెంగెము నేనాడితేను
వక్కణ చెప్పెతనికి వాసివుట్టించేవు
(॥॥)
దిమ్మరై తిరుగఁగా నేఁ దిట్లు దిట్టినవెల్లా
అమ్మరో పూగుచ్చి నట్లప్పగించితి-
వుమ్మడి శ్రీవేంకటేశుఁ డొనగడి నన్ను నంటె
ఇమ్ముల నిది చెప్పుమనెమ్మెలు సేసేవు
(||pallavi||)
kānīvamma yī puṇyamu gaṭṭugovammā
pūni yādani kĕṁtesi buddulu sĕppevu
(||||)
ne kādam̐ḍu rāguṁḍam̐gā neramu lĕṁchinavĕllā
kānugagām̐ baṭṭidivi kāṁtunigi
menibai machchamu sūsi mĕllane ne navvidenu
dānigim̐gā nādani paṁtamu rem̐sevu
(||||)
takkivuṁḍina yādanim̐ dappulu vaṭṭinavĕllā
akkunam̐bosi sūbidi vādanigini
vĕkkasabum̐ jĕmaḍagu vĕṁgĕmu nenāḍidenu
vakkaṇa sĕppĕdanigi vāsivuṭṭiṁchevu
(||||)
dimmarai tirugam̐gā nem̐ diṭlu diṭṭinavĕllā
ammaro pūguchchi naṭlappagiṁchidi-
vummaḍi śhrīveṁkaḍeśhum̐ ḍŏnagaḍi nannu naṁṭĕ
immula nidi sĕppumanĕmmĕlu sesevu