కానీమ(వ?)య్యా దాని కేమి కాదనేమా నిన్నును
(॥పల్లవి॥)
కానీమ(వ?)య్యా దాని కేమి కాదనేమా నిన్నును
పూని మమ్ము నిట్లానే భోగించేవు గాక
(॥కానీ॥)
వదలుఁబయ్యదతోడ వానగుబ్బలు చూపి
యెదట నుండి చెలి యెలయించీని
మొదట నే యీపె నీకు మోహపుదేవులట
పదరి యిందుకు నీవు భ్రమయకుండుదువా
(॥కానీ॥)
సారె జారుఁ దురుములో జాజులు పై వావించి
తేరకొన నిన్నుఁ జూచి తేలించీని
వూరటగా నెప్పుడూ నీవొద్దఁ బాయకుండే దిదె
చేరియాపె చెప్పినట్టు సేయ కుండుదువా
(॥కానీ॥)
తేటల మాటలతోడ తియ్యని మోవి యొసఁగి
గాఁటముగా నిన్ను నిదె కాఁగిలించీని
యీటుగా శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వాఁటముగా నిదె నాకు వలవ కుండుదువా
(||pallavi||)
kānīma(va?)yyā dāni kemi kādanemā ninnunu
pūni mammu niṭlāne bhogiṁchevu gāga
(||kānī||)
vadalum̐bayyadadoḍa vānagubbalu sūbi
yĕdaḍa nuṁḍi sĕli yĕlayiṁchīni
mŏdaḍa ne yībĕ nīgu mohabudevulaḍa
padari yiṁdugu nīvu bhramayaguṁḍuduvā
(||kānī||)
sārĕ jārum̐ durumulo jājulu pai vāviṁchi
teragŏna ninnum̐ jūsi teliṁchīni
vūraḍagā nĕppuḍū nīvŏddam̐ bāyaguṁḍe didĕ
seriyābĕ sĕppinaṭṭu seya kuṁḍuduvā
(||kānī||)
teḍala māḍaladoḍa tiyyani movi yŏsam̐gi
gām̐ṭamugā ninnu nidĕ kām̐giliṁchīni
yīḍugā śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vām̐ṭamugā nidĕ nāgu valava kuṁḍuduvā