Kaaneeleve yamdugemi kamtimi neejaadalellaa

కానీలేవే యందుకేమి కంటిమి నీజాడలెల్లా
Language

(॥పల్లవి॥)
కానీలేవే యందుకేమి కంటిమి నీజాడలెల్లా
నా నేరుపు లెఱఁగవా నా వాఁడాయ నితఁడు

(॥కానీ॥)
మూసిన ముత్తెమువలె ముందరను నిలుచుండి
ఆసలు వుట్టించే వేమే యతనికిని
పూస గుచ్చినటువలె పొసఁగఁగ మాఁటలాడి
లాసిలాసి మతని మెల్లనె దక్కఁగొంటివే

(॥కానీ॥)
వనము కోవిలవలె వరుసఁ బాటలు వాడి
మనసు గరఁచే వేమే మగవానిని
పెనచి యటువలె పీఁటమీఁదఁ గూచుండి
చెనకి చెనకి లోను చేసుకొంటివే

(॥కానీ॥)
పాయని చుట్టము వలె పక్కఁ బండి యీతని
మాయలఁ బెట్టేవేమే మాఁటి మాఁటికి
యీయెడ శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁ గూడె
చాయలా సన్నలా నీవూఁ జవులు చూపితివే

(||pallavi||)
kānīleve yaṁdugemi kaṁṭimi nījāḍalĕllā
nā nerubu lĕṟam̐gavā nā vām̐ḍāya nidam̐ḍu

(||kānī||)
mūsina muttĕmuvalĕ muṁdaranu nilusuṁḍi
āsalu vuṭṭiṁche veme yadanigini
pūsa guchchinaḍuvalĕ pŏsam̐gam̐ga mām̐ṭalāḍi
lāsilāsi madani mĕllanĕ dakkam̐gŏṁṭive

(||kānī||)
vanamu kovilavalĕ varusam̐ bāḍalu vāḍi
manasu garam̐se veme magavānini
pĕnasi yaḍuvalĕ pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍi
sĕnagi sĕnagi lonu sesugŏṁṭive

(||kānī||)
pāyani suṭṭamu valĕ pakkam̐ baṁḍi yīdani
māyalam̐ bĕṭṭeveme mām̐ṭi mām̐ṭigi
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
sāyalā sannalā nīvūm̐ javulu sūbidive