కానీలేవే యందుకేమి కందము నీ సరితలు
(॥పల్లవి॥)
కానీలేవే యందుకేమి కందము నీ సరితలు
నానఁగానే వలపులు నయమిచ్చీని
(॥॥)
నెలకొని రమణుఁడు నీపై బత్తిగలఁడంటా
సలిగెలు చూపేవు సవతులకు
బలిమినే మంచమెక్కి పాదాలు పైఁ దీసుకొని
వలవని దొరతనములు సేసేవు
(॥॥)
చేరి నిన్ను మెచ్చీనంటా చేకొని నీ ప్రియునికి
నేరుపుతో నూడిగాలు సారెఁ జేసేవు
కోరి చిటికలుదీసి కొత్తగా వచ్చితినంటా
వూరకే చుట్టరికము లొనర నవ్వేవు
(॥॥)
యేపున శ్రీ వేంకటేశు నెన్నడో కూడితినంటా
కాఁపురాలు సేసిసేసి కడ గానవు
వోపిక నలమేల్మంగ నురము పై నున్నదాన
పైపైఁ జాయ సేసుక పక్కన మెచ్చేవు
(||pallavi||)
kānīleve yaṁdugemi kaṁdamu nī saridalu
nānam̐gāne valabulu nayamichchīni
(||||)
nĕlagŏni ramaṇum̐ḍu nībai battigalam̐ḍaṁṭā
saligĕlu sūbevu savadulagu
balimine maṁchamĕkki pādālu paim̐ dīsugŏni
valavani dŏradanamulu sesevu
(||||)
seri ninnu mĕchchīnaṁṭā segŏni nī priyunigi
nerubudo nūḍigālu sārĕm̐ jesevu
kori siḍigaludīsi kŏttagā vachchidinaṁṭā
vūrage suṭṭarigamu lŏnara navvevu
(||||)
yebuna śhrī veṁkaḍeśhu nĕnnaḍo kūḍidinaṁṭā
kām̐purālu sesisesi kaḍa gānavu
vobiga nalamelmaṁga nuramu pai nunnadāna
paibaim̐ jāya sesuga pakkana mĕchchevu