Kaaneeleve seliyaa kamtimi neegunaalella

కానీలేవే చెలియా కంటిమి నీగుణాలెల్ల
Language

(॥పల్లవి॥)
కానీలేవే చెలియా కంటిమి నీగుణాలెల్ల
కానవచ్చె నీవు పొత్తుఁ గలసితివేమో

(॥కానీ॥)
వాడికతో రమణుఁడు వచ్చితే రానీఁగదవే
వేడుకగా నేనే విన్నవించేఁగాని
ఆడుమన్న మాటలు నీ వాడవేమో యతనితో
ఆడునుండాతఁడు పరాకై వూరకుండునా

(॥కానీ॥)
ముప్పిరి నేనున్నదిక్కు మొగమైతేఁ జాలునే
చొప్పులెత్తి నేనే అన్నీఁ జూపేఁగాని
యెప్పుడు నీమొగమోటా లేమిగలవోకాక
తప్పక యేపొద్దూ నన్నే తలఁచకవుండునా

(॥కానీ॥)
యెలమి శ్రీవేంకటేశుఁ డిటు పవ్వళించనీవే
అలమేల్ మంగఁ గనక అలమేఁగాని
కలసితి నీవతనిఁ గదిసి వచ్చతివేమో
మలసి తా నిన్నాళ్లు మఱచి యట్టుండునా

(||pallavi||)
kānīleve sĕliyā kaṁṭimi nīguṇālĕlla
kānavachchĕ nīvu pŏttum̐ galasidivemo

(||kānī||)
vāḍigado ramaṇum̐ḍu vachchide rānīm̐gadave
veḍugagā nene vinnaviṁchem̐gāni
āḍumanna māḍalu nī vāḍavemo yadanido
āḍunuṁḍādam̐ḍu parāgai vūraguṁḍunā

(||kānī||)
muppiri nenunnadikku mŏgamaidem̐ jālune
sŏppulĕtti nene annīm̐ jūbem̐gāni
yĕppuḍu nīmŏgamoḍā lemigalavogāga
tappaga yebŏddū nanne talam̐sagavuṁḍunā

(||kānī||)
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiḍu pavvaḽiṁchanīve
alamel maṁgam̐ ganaga alamem̐gāni
kalasidi nīvadanim̐ gadisi vachchadivemo
malasi tā ninnāḽlu maṟasi yaṭṭuṁḍunā