కానీలేవే అట్టె కానీలేవే అట్టె కానీలేవే
(॥పల్లవి॥)
కానీలేవే అట్టె కానీలేవే అట్టె కానీలేవే
పోనీ చూత మింకఁ దనపొందు చెరుచనేల
(॥కానీ॥)
చలమా తనతో నాకు సరవినడపినాఁ గాదనను
వలచి తాఁ బైకొనివచ్చినా వాదులడువనేలా నాకు
(॥కానీ॥)
పగలా తనకు నాకు బాసవేసినాఁ దగదనను
తగిలి తా రమ్మనునెడ నేఁ దామసించనేలా నాకు
(॥కానీ॥)
బడి నే శ్రీవేంకటగిరి పైఁ బంతమిచ్చే నిఁకనేమనను
కడపరాయఁడు ననునేలెనుకడమ లెంచనేలా నాకు
(||pallavi||)
kānīleve aṭṭĕ kānīleve aṭṭĕ kānīleve
ponī sūda miṁkam̐ danabŏṁdu sĕrusanela
(||kānī||)
salamā tanado nāgu saravinaḍabinām̐ gādananu
valasi tām̐ baigŏnivachchinā vādulaḍuvanelā nāgu
(||kānī||)
pagalā tanagu nāgu bāsavesinām̐ dagadananu
tagili tā rammanunĕḍa nem̐ dāmasiṁchanelā nāgu
(||kānī||)
baḍi ne śhrīveṁkaḍagiri paim̐ baṁtamichche nim̐kanemananu
kaḍabarāyam̐ḍu nanunelĕnugaḍama lĕṁchanelā nāgu