Kaaneeleve amdugemi kanugone nanniyunu

కానీలేవే అందుకేమి కనుకొనే నన్నియును
Language

(॥పల్లవి॥)
కానీలేవే అందుకేమి కనుకొనే నన్నియును
సానఁబట్టేచూపు లేలే సలిపీ నిద్దరికి

(॥కానీ॥)
ఆడినవి గొన్నియు నాడనివి గొన్నియు
కూడనిచోటికి నన్నీఁ గొరకొరలే
యీడుగాని జగడాన కింత యేమి అంత యేమి
తోడ నాకు నీకు గుఱి దొరయైనవిభుఁడే

(॥కానీ॥)
చేసినది గొంత చేయనిది గొంతచేఁత
యీసుగలచోటికి నింతా యెరవెరవే
వాసిగల వనితకు వద్ద నున్న లేకున్న
ఆస వొక్కటే గుఱి యంకెల నిద్దరికి

(॥కానీ॥)
కౌఁగిటికరఁగులును కందువచెరఁగులును
మాఁగ వలచినవారిమచ్చిక లవి
దాఁగక యిద్దరిఁ గూడె తగు శ్రీవేంకటపతి
చేగదేరె పంతము చెంగట నిద్దరికి

(||pallavi||)
kānīleve aṁdugemi kanugŏne nanniyunu
sānam̐baṭṭesūbu lele salibī niddarigi

(||kānī||)
āḍinavi gŏnniyu nāḍanivi gŏnniyu
kūḍanisoḍigi nannīm̐ gŏragŏrale
yīḍugāni jagaḍāna kiṁta yemi aṁta yemi
toḍa nāgu nīgu guṟi dŏrayainavibhum̐ḍe

(||kānī||)
sesinadi gŏṁta seyanidi gŏṁtasem̐ta
yīsugalasoḍigi niṁtā yĕravĕrave
vāsigala vanidagu vadda nunna legunna
āsa vŏkkaḍe guṟi yaṁkĕla niddarigi

(||kānī||)
kaum̐giḍigaram̐gulunu kaṁduvasĕram̐gulunu
mām̐ga valasinavārimachchiga lavi
dām̐gaga yiddarim̐ gūḍĕ tagu śhrīveṁkaḍabadi
segaderĕ paṁtamu sĕṁgaḍa niddarigi