కానీలే అందుకేమి కద్దావోయి
(॥పల్లవి॥)
కానీలే అందుకేమి కద్దావోయి
వూని యాకె నీ యింట నున్నదని వింటిమి
(॥కానీ॥)
పోలించ నీ కాపెకునుఁ బొందు గద్దని వింటిమి
ఆలించి ఆమాట దోయవని వింటిమి
యేలేనని నీవు బాసలిచ్చితివని వింటిమి
శీలముతో విందారగించితివని వింటిమి
(॥కానీ॥)
నంటున నాపెగోరు మేన నున్నదని వింటిమి
అంటువాయని చట్టమవని వింటిమి
యింటిలో నేపొద్దు కాఁగి లెడయవని వింటిమి
దంటతనపు మీయేకతములెల్ల వింటిమి
(॥కానీ॥)
సేయరాని వినయాలు సేయుదువని వింటిమి
ఆయాలు మోచినరతు లవి వింటిమి
యీయెడ శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
చాయల నన్ను మన్నించే సంగతులు వింటిమి
(||pallavi||)
kānīle aṁdugemi kaddāvoyi
vūni yāgĕ nī yiṁṭa nunnadani viṁṭimi
(||kānī||)
poliṁcha nī kābĕgunum̐ bŏṁdu gaddani viṁṭimi
āliṁchi āmāḍa doyavani viṁṭimi
yelenani nīvu bāsalichchidivani viṁṭimi
śhīlamudo viṁdāragiṁchidivani viṁṭimi
(||kānī||)
naṁṭuna nābĕgoru mena nunnadani viṁṭimi
aṁṭuvāyani saṭṭamavani viṁṭimi
yiṁṭilo nebŏddu kām̐gi lĕḍayavani viṁṭimi
daṁṭadanabu mīyegadamulĕlla viṁṭimi
(||kānī||)
seyarāni vinayālu seyuduvani viṁṭimi
āyālu mosinaradu lavi viṁṭimi
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
sāyala nannu manniṁche saṁgadulu viṁṭimi