Kaaneele amdugemi kaamini daane vachchi

కానీలే అందుకేమి కామిని దానె వచ్చి
Language

(॥పల్లవి॥)
కానీలే అందుకేమి కామిని దానె వచ్చి
మైనమువలెఁ జేయక మనమాట వినునా

(॥కానీ॥)
చలపాదివానితోడ జాణతనాలాడితేను
మలసి తనగుణము మానీనా
మొలకచన్ను మొనల మోసుల నూఁడి మనసు
చెలఁగించినఁగాక చెప్పినట్లు సేసునా

(॥కానీ॥)
గట్టువాయవానితోడ కతలెన్ని చెప్పినాను
అట్టే వుండుఁగాక చాయకు వచ్చీనా
మట్టుమీరఁ గొనగోర మర్మములెల్లా నంటి
వొట్టి కరఁగించక వొడఁబడనేర్చునా

(॥కానీ॥)
శ్రీవేంకంటేశ్వరునిఁ జెక్కు లెంతనొక్కినాను
చేవలుమీరుఁగాక సిగ్గువడీనా
యీవేళనే యింతిఁ గూడి ఇచ్చలాడి వురముపై
తావుకొన నిటుగాక తనవోజ మానునా

(||pallavi||)
kānīle aṁdugemi kāmini dānĕ vachchi
mainamuvalĕm̐ jeyaga manamāḍa vinunā

(||kānī||)
salabādivānidoḍa jāṇadanālāḍidenu
malasi tanaguṇamu mānīnā
mŏlagasannu mŏnala mosula nūm̐ḍi manasu
sĕlam̐giṁchinam̐gāga sĕppinaṭlu sesunā

(||kānī||)
gaṭṭuvāyavānidoḍa kadalĕnni sĕppinānu
aṭṭe vuṁḍum̐gāga sāyagu vachchīnā
maṭṭumīram̐ gŏnagora marmamulĕllā naṁṭi
vŏṭṭi karam̐giṁchaga vŏḍam̐baḍanersunā

(||kānī||)
śhrīveṁkaṁṭeśhvarunim̐ jĕkku lĕṁtanŏkkinānu
sevalumīrum̐gāga sigguvaḍīnā
yīveḽane yiṁtim̐ gūḍi ichchalāḍi vuramubai
tāvugŏna niḍugāga tanavoja mānunā