కానీలే అందుకేమాయ ఘనుఁడవు నీ విన్నిటా
(॥పల్లవి॥)
కానీలే అందుకేమాయ ఘనుఁడవు నీ విన్నిటా
దానికేమి యిది నీ పెద్దఱికమే కాదా
(॥॥)
పంతమాడరాదుగాక పలుమారు నీ చేఁతలు
కొంతగొంతైనా నీతోడఁ గొనాడరాదా
అంతటివాఁడవుగావా అడఁతురా నీగుణాలు
చెంతల నామోము చూచి సిగ్గులువడుదురా
(॥॥)
జంకించఁగరాదు గాక చక్కనినీమోము చూచి
కంకణాలచేయెత్తి మొక్కఁగరాదా
అంకె లింతనేరవా సేయఁగవద్దా వినయాలు
కొంకుదేరి నాయెదుట కొల్లున నవ్వుదురా
(॥॥)
అలుగఁగరాదుగాక అట్టె నీకాఁగిటను
సొలవక మోవి యాని చొక్కించరాదా
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నెలకొన్న నీ పొందులు నివ్వెర గందుదురా
(||pallavi||)
kānīle aṁdugemāya ghanum̐ḍavu nī vinniḍā
dānigemi yidi nī pĕddaṟigame kādā
(||||)
paṁtamāḍarādugāga palumāru nī sem̐talu
kŏṁtagŏṁtainā nīdoḍam̐ gŏnāḍarādā
aṁtaḍivām̐ḍavugāvā aḍam̐turā nīguṇālu
sĕṁtala nāmomu sūsi sigguluvaḍudurā
(||||)
jaṁkiṁcham̐garādu gāga sakkaninīmomu sūsi
kaṁkaṇālaseyĕtti mŏkkam̐garādā
aṁkĕ liṁtaneravā seyam̐gavaddā vinayālu
kŏṁkuderi nāyĕduḍa kŏlluna navvudurā
(||||)
alugam̐garādugāga aṭṭĕ nīgām̐giḍanu
sŏlavaga movi yāni sŏkkiṁcharādā
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nĕlagŏnna nī pŏṁdulu nivvĕra gaṁdudurā