Kaaneegaanee yamdugemi kadama dereemgaaga

కానీకానీ యందుకేమి కడమ దేరీఁగాక
Language

(॥పల్లవి॥)
కానీకానీ యందుకేమి కడమ దేరీఁగాక
నానఁగాఁ గోపము దీరి నవ్వువచ్చెఁగాక

(॥కానీ॥)
అనలేనా నిన్ను నే ననఁగలమాటఁలెల్లా
మనసు నొచ్చీనంటా మానితిఁగాక
చెనకలేనా నీవు సేసిన చేఁతకుఁ జేత
తనువు పచ్చౌనంటా దయవుట్టెఁగాక

(॥కానీ॥)
బొమ్మల జంకించలేనా పుక్కిటితమ్మటు చూచి
నెమ్మి సిగ్గువడేవంటా నే నుంటిఁగాక
చెమ్మఁజెమటలు చూచి చేరి యలుగఁగలేనా
వుమ్మడిఁ జింతించేవంటా నొక్కటైతిఁగాక

(॥కానీ॥)
పంతమాడలేనా నీపరవశములు చూచి
కొంత నీవెఱిఁగేవంటాఁగూడితిఁగాక
యింతటా శ్రీవేంకటేశ యేకమైతి మిద్దరము
వంతువాసు లెంచలేనా వలచితిఁగాక

(||pallavi||)
kānīgānī yaṁdugemi kaḍama derīm̐gāga
nānam̐gām̐ gobamu dīri navvuvachchĕm̐gāga

(||kānī||)
analenā ninnu ne nanam̐galamāḍam̐lĕllā
manasu nŏchchīnaṁṭā mānidim̐gāga
sĕnagalenā nīvu sesina sem̐tagum̐ jeda
tanuvu pachchaunaṁṭā dayavuṭṭĕm̐gāga

(||kānī||)
bŏmmala jaṁkiṁchalenā pukkiḍidammaḍu sūsi
nĕmmi sigguvaḍevaṁṭā ne nuṁṭim̐gāga
sĕmmam̐jĕmaḍalu sūsi seri yalugam̐galenā
vummaḍim̐ jiṁtiṁchevaṁṭā nŏkkaḍaidim̐gāga

(||kānī||)
paṁtamāḍalenā nībaravaśhamulu sūsi
kŏṁta nīvĕṟim̐gevaṁṭām̐gūḍidim̐gāga
yiṁtaḍā śhrīveṁkaḍeśha yegamaidi middaramu
vaṁtuvāsu lĕṁchalenā valasidim̐gāga