కానీకానీ లేరా కడమయి వుండనీరా
(॥పల్లవి॥)
కానీకానీ లేరా కడమయి వుండనీరా
నేను నీవు నిట్లానే నిలుచుంటేఁ జాలురా
(॥కానీ॥)
ముంచి మాటలాడేది మోవితేనె చిందుదాఁక
యెంచినప్రియాలు పాను పెక్కుదాఁకానే
పంచలనవ్వేనవ్వులు పైఁ జేయి వేయుదాఁకా
ఇంచుకంత గడచితే నీడ నుండఁబొయ్యేవా
(॥కానీ॥)
కప్పుర మియ్యవచ్చేది కాఁగిట నించినదాఁక
తప్పకచూచుట నన్ను దగ్గరుదాఁకా
అప్పటి నానవెట్టేది ఆయముమోచినదాఁకా
దప్పులుదేరినమీఁద తలఁచఁబొయ్యేవా
(॥కానీ॥)
చెక్కులు నొక్కేదెల్లా చేరి నే లోనై నదాఁకా
మొక్కలు మొక్కేది తుదిముట్టినదాఁకా
అక్కరతో శ్రీ వేంకటాధిప కూడితి విట్టె
వొక్కమనసైనమీఁద నొడఁబాట్లేలరా
(||pallavi||)
kānīgānī lerā kaḍamayi vuṁḍanīrā
nenu nīvu niṭlāne nilusuṁṭem̐ jālurā
(||kānī||)
muṁchi māḍalāḍedi movidenĕ siṁdudām̐ka
yĕṁchinapriyālu pānu pĕkkudām̐kāne
paṁchalanavvenavvulu paim̐ jeyi veyudām̐kā
iṁchugaṁta gaḍaside nīḍa nuṁḍam̐bŏyyevā
(||kānī||)
kappura miyyavachchedi kām̐giḍa niṁchinadām̐ka
tappagasūsuḍa nannu daggarudām̐kā
appaḍi nānavĕṭṭedi āyamumosinadām̐kā
dappuluderinamīm̐da talam̐sam̐bŏyyevā
(||kānī||)
sĕkkulu nŏkkedĕllā seri ne lonai nadām̐kā
mŏkkalu mŏkkedi tudimuṭṭinadām̐kā
akkarado śhrī veṁkaḍādhiba kūḍidi viṭṭĕ
vŏkkamanasainamīm̐da nŏḍam̐bāṭlelarā