Kaaneegaanee ippudela kadum bamtaalu

కానీకానీ ఇప్పుడేల కడుఁ బంతాలు
Language

(॥పల్లవి॥)
కానీకానీ ఇప్పుడేల కడుఁ బంతాలు
తాను నేనుఁ గూడితేఁగా తలపోతలు

(॥॥)
చెక్కుచెక్కుఁ గదియించి చేయిఁజేయి బిగియించి
అక్కడగా నీతో నామాటలు
పుక్కిటితమ్ముల మిడి బుజాన గడ్డమానించి
చిక్కించుకొన్నపుడు గా సేసేచేఁతలు

(॥॥)
పాదము పాదానఁదొక్కి పానుపు పైఁ బవ్వళించి
పాదుకొన్నప్పుడుగా నాబలిమెల్లాను
పోదిగాఁ జన్నులు మోపి పులకలు మేన రేఁచి
ఆదెస నింతేకా నెయ్యపు నవ్వులు

(॥॥)
కాయముఁ గాయము మోపి కమ్మరనే మోవిఇచ్చి
యీయెడ నింతేకా నా ఇంపుసొంపులు
పాయపు శ్రీ వేంకటాద్రిపతి నన్ను నిదె కూడె
చాయల నీమీఁదఁగా నాసరసములు

(||pallavi||)
kānīgānī ippuḍela kaḍum̐ baṁtālu
tānu nenum̐ gūḍidem̐gā talabodalu

(||||)
sĕkkusĕkkum̐ gadiyiṁchi seyim̐jeyi bigiyiṁchi
akkaḍagā nīdo nāmāḍalu
pukkiḍidammula miḍi bujāna gaḍḍamāniṁchi
sikkiṁchugŏnnabuḍu gā sesesem̐talu

(||||)
pādamu pādānam̐dŏkki pānubu paim̐ bavvaḽiṁchi
pādugŏnnappuḍugā nābalimĕllānu
podigām̐ jannulu mobi pulagalu mena rem̐si
ādĕsa niṁtegā nĕyyabu navvulu

(||||)
kāyamum̐ gāyamu mobi kammarane moviichchi
yīyĕḍa niṁtegā nā iṁpusŏṁpulu
pāyabu śhrī veṁkaḍādribadi nannu nidĕ kūḍĕ
sāyala nīmīm̐dam̐gā nāsarasamulu