Kaanee kaaneevayyaa nee kadalanni neṟumgudu

కానీ కానీవయ్యా నీ కతలన్ని నెఱుఁగుదు
Language

(॥పల్లవి॥)
కానీ కానీవయ్యా నీ కతలన్ని నెఱుఁగుదు
పూనిపట్టి మాట లెంత పొసఁగనాడేవు

(॥కానీ॥)
గట్టినాచన్నుల నీమెయి కడుఁగాఁడ నెత్తుక
యిట్టి నీజవ్వనగర్వ మేల మానేవు
చుట్టిచుట్టి గొనగొరుసోఁక సరసమాడక
తోట్టిన నీమదమేల తుదమొద లెంచును

(॥కానీ॥)
గబ్బినానోరను నిన్నుఁ గరకులెల్లా నాడక
వుబ్బరివై తిట్టకేల వుండేవు నీవు
నిబ్బరపుచన్నులను నీమనసుఁ గరఁచక
సిబ్బితితో నీవేల నాచెప్పినట్టు సేతువు

(॥కానీ॥)
పరపుపై నీవు నేనుఁ బడితళించినఁగాక
సరుగ నీవేల వోజకు వచ్చేవు
అరయ శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
తిరమై నన్నేలితివి తేర యేల వేసేవు

(||pallavi||)
kānī kānīvayyā nī kadalanni nĕṟum̐gudu
pūnibaṭṭi māḍa lĕṁta pŏsam̐ganāḍevu

(||kānī||)
gaṭṭināsannula nīmĕyi kaḍum̐gām̐ḍa nĕttuga
yiṭṭi nījavvanagarva mela mānevu
suṭṭisuṭṭi gŏnagŏrusom̐ka sarasamāḍaga
toṭṭina nīmadamela tudamŏda lĕṁchunu

(||kānī||)
gabbinānoranu ninnum̐ garagulĕllā nāḍaga
vubbarivai tiṭṭagela vuṁḍevu nīvu
nibbarabusannulanu nīmanasum̐ garam̐saga
sibbidido nīvela nāsĕppinaṭṭu seduvu

(||kānī||)
parabubai nīvu nenum̐ baḍidaḽiṁchinam̐gāga
saruga nīvela vojagu vachchevu
araya śhrīveṁkaḍeśha alamel‌maṁgabadivi
tiramai nannelidivi tera yela vesevu