Kaanee kaaneeleve kaligi | ne

కానీ కానీలేవే కలికి । నే
Language

(॥పల్లవి॥)
కానీ కానీలేవే కలికి । నే
పూని నీతోఁ బలికితే పూఁచి నీవు నగరా

(॥కానీ॥)
మాఁట చెప్పే రావే మగువా! ఆఁ
మాఁటలు నే నెఱుఁగుదు మానరా నీవు
యేఁటికె యీబిగువులు యిట్టే వుండీనా! నీఁ
చోటికిఁ గిందుపడితే చూపి నీవు నగరా

(॥కానీ॥)
పనిగగ్దు రావే పడఁతీ! ఆఁ
పనులు నే నెఱుఁగుదు పదరా నీవు
పెనఁగకువే నాతోఁ బెక్కుమారులు! నాఁ
మనసు మెత్తనిదైతే మరి నీవు నగరా

(॥కానీ॥)
కాఁగిలించే రావే కాంతా! తొల్లె
కాఁగిటనే వున్నదానఁ గదరా నేను
ఆఁగి యిందాఁకా నేల అంటివే నీవూ! నీకు
వీఁగితి శ్రీవేంకటేశ వికవిక నగరా

(||pallavi||)
kānī kānīleve kaligi | ne
pūni nīdom̐ baligide pūm̐si nīvu nagarā

(||kānī||)
mām̐ṭa sĕppe rāve maguvā! ām̐
mām̐ṭalu ne nĕṟum̐gudu mānarā nīvu
yem̐ṭigĕ yībiguvulu yiṭṭe vuṁḍīnā! nīm̐
soḍigim̐ giṁdubaḍide sūbi nīvu nagarā

(||kānī||)
panigagdu rāve paḍam̐tī! ām̐
panulu ne nĕṟum̐gudu padarā nīvu
pĕnam̐gaguve nādom̐ bĕkkumārulu! nām̐
manasu mĕttanidaide mari nīvu nagarā

(||kānī||)
kām̐giliṁche rāve kāṁtā! tŏllĕ
kām̐giḍane vunnadānam̐ gadarā nenu
ām̐gi yiṁdām̐kā nela aṁṭive nīvū! nīgu
vīm̐gidi śhrīveṁkaḍeśha vigaviga nagarā