కానీ కానీ యిఁకనేల కదిసిన పనులకు
(॥పల్లవి॥)
కానీ కానీ యిఁకనేల కదిసిన పనులకు
మానువలె నిగిరించె మాఁటలకే మేను
(॥కానీ॥)
కాలుదాఁకితే నేమాయ కాంతల మింతే నేము
మూల నిందిరపాదాలు మోవవా నీవు
లేలే పెద్దరికాలు లెక్కలేవు నీవొద్ద
యీలకూర కుప్పుచాల దిందుకేపో నాకు
(॥కానీ॥)
మేను మోచితే నేమాయ మెలుఁత నింతే నేను
మోనాన భూకాంత మేను మోవవా నీవు
పోని పోని యెవ్వరితో బూటకాలు సేసేవు
నానదాయ గొడ్డలేమి నవ్వులనే నాకు
(॥కానీ॥)
మోవి మోపితే నేమాయ ముదితలయెంగి లింతే
మోవి నీవు గొల్లెతల మోపవా తొల్లి
భావించి శ్రీవేంకటేశ పై కొనిట్టె కూడితివి
చేవ గలిగినట్టాయ చిగురందే నాకు
(||pallavi||)
kānī kānī yim̐kanela kadisina panulagu
mānuvalĕ nigiriṁchĕ mām̐ṭalage menu
(||kānī||)
kāludām̐kide nemāya kāṁtala miṁte nemu
mūla niṁdirabādālu movavā nīvu
lele pĕddarigālu lĕkkalevu nīvŏdda
yīlagūra kuppusāla diṁdugebo nāgu
(||kānī||)
menu moside nemāya mĕlum̐ta niṁte nenu
monāna bhūgāṁta menu movavā nīvu
poni poni yĕvvarido būḍagālu sesevu
nānadāya gŏḍḍalemi navvulane nāgu
(||kānī||)
movi mobide nemāya mudidalayĕṁgi liṁte
movi nīvu gŏllĕdala mobavā tŏlli
bhāviṁchi śhrīveṁkaḍeśha pai kŏniṭṭĕ kūḍidivi
seva galiginaṭṭāya siguraṁde nāgu